Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How many piles should there be for Yajnopaveeta.?

 యజ్ఞోపవీతానికి ఎన్ని పోగులు ఉండాలి.?

కొందరు అత్యవసరమైన సమయాల్లో తమ జంధ్యంలో నుంచి కొన్ని పోగులు తీసి కొడుకలకు, ఇతరులకు ఇస్తుంటారు.

యజ్ఞోపవీతంలో మూడేసి చొప్పున  పోగులు ఒక యూనిట్ గా భావించాలి. బ్రహ్మచారికి 3 పోగులుగా ఉన్న యజ్ఞోపవితాన్ని వేస్తారు.

పెళ్ళి అయ్యాక మామగారు భార్య తరఫు భార్య తాలూకు యజ్ఞోపవితాన్ని వేస్తారు. అంటే మొగుడు భార్య కి తాళి కడతాడు. భార్య తాలూకు యజ్ఞోపవితాన్ని మొగుడు భరిస్తాడు. అందుకే భార్య నెలసరిలో ఉంటే పుణ్య కార్యాలు చెయ్యరు. భార్య అంటే తనలో సగం కాబట్టి.

పెళ్లి అయిన వాళ్ళు ఈ లెక్క ప్రకారం రెండు యూనిట్స్ అనగా 6 పోగులు వేసుకోవాలి. అంటే భర్త సంధ్య వారిస్తే భార్య కూడా చేసినట్టే. అందుకే పురాణ కాలంలో భార్యలు భర్త సంధ్యావందనానికి ఏర్పాట్లు చేసేవారు. ఇప్పటికి చేసేవారున్నారనుకోండి. సంధ్య వార్చడం ద్వారా ఏ రోజు పాపం ఆ రోజు ప్రక్షాళన అయిపోతుంది.

మరో మూడు పొగులు ఉన్న యజ్ఞోపవీతం కూడా అదనంగా వేసుకుంటారు. అది ఎందుకనగా ఉత్తరీయం కోసం. ఉత్తరీయం లేకుండా ఎప్పుడు ఉండకూడదు. ఆ దోషం తగలకుండా మూడు పొగులు వేస్తారు. ధర్మం ప్రకారం ఎప్పుడు మనిషి దిగంబరంగా ఉండకూడదు. ఆ దోషం రాకుండా నూలు పోగు గా మొలతాడు ఎప్పుడు ఉండాలి.

మరో మూడు పొగులు ఉన్న యూనిట్ ను ఇష్టముంటే వేసుకోవచ్చు. ఇది వేరే వారికి ఇవ్వొచ్చు. ఒకవేళ ఎవరికైనా జంధ్యం తెగిపోతే ఇచ్చే అందుకు ఈ ఏర్పాటు. ప్రతి జంధ్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి.

ఉపనయనము అయిన పిదప యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా వ్యక్తి ఉండనే రాదు. అలాగే భిన్న తంతువులు కల యజ్ఞోపవీతం కూడా ధరించరాదు. అందుకని, తను వేసుకున్న నాలుగవది వేరొకరికి దానం చేస్తారు.. ఇది కేవలం ఆ వ్యక్తి తను ఇంటికి వెళ్ళాక శుచియై, క్రొత్త యజ్ఞోపవీతాలను వేసుకునేంతవరకు 'ఆపత్ ధర్మ' ఏర్పాటు అని చెప్పవచ్చు.

చాలా మంది పాటించడం లేదు కానీ, యజ్ఞోపవీతానికి చాలా పవిత్రత ఉన్నది. "యజ్ఞోపవీతం పరమం పవిత్రం...ప్రజాపతేర్యత్....." కదా ! అది ఎంత పొడవు ఉండాలి అన్నదీ చెప్పారు. నడుము క్రిందకు ఉండరాదు.. ఉన్నచో కొన్ని ముడులు వేసి, పొడవు తగ్గించుకోవాలి.

ఎప్పుడు మార్చాలి, ఎంత తరచుగా మార్చాలి అన్నది కూడా చెప్పారు. అశౌచం వీడిన తర్వాత మార్చాలి. ఏ అశౌచం లేకపోయినా 3 నెలలకు ఒక సారి అని కొందరు, 6 నెలలకు ఒక సారి అని కొందరు పెద్దలు సెలవిచ్చారు. ఇక శ్రావణ పౌర్ణిమకు ఋగ్వేదులు మినహా మిగతా సాంప్రదాయాలవారు తప్పనిసరి గా మార్చుకుంటారు.

ఈ కాలంలో కొంత మంది దానికి తాళం చెవులు తగిలిస్తారు. కొందరైతే ఏకంగా ఆ యజ్ఞోపవీతాన్నే తీసి గోడకూ తగిలించేస్తారని విన్నాను !

యజ్ఞోపవీతాన్ని మూడు రకాలుగా ధరిస్తారు: ఉపవీతి, సంవీతి, నివీతి.

ఉపవీతి అంటే ఎడం భుజం మీద నుండీ కుడి చేతి క్రిందుగా ధరించడం. ( దీన్నే 'సవ్యం' అనీ పిలుస్తారు.)

సంవీతి అంటే కుడి భుజంపై నుండీ ఎడమచేతి క్రిందవుండేట్లుగా వేసుకోవడం. ( దీన్నే ' అపసవ్యం' అనీ పిలుస్తారు.)

నివీతి అంటే మెడలో హారం లాగా ధరించడం.

దైవ కార్యాలలో ఉపవీతం సవ్యంగా ఉండాలి. పితృ కార్యాలలో అపసవ్యం గా ఉండాలి. ఇక మనుష్య కార్యాలలో నివీతి గా ఉండాలి.మల, మూత్ర విసర్జనా సమయాయాలలో నివీతి చేసి కుడి చెవుకు చుట్టుకోవాలి

అటే మొత్తం 3 నుండి 12 పొగులు వేస్తారు. అర్హత బట్టి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How many piles should there be for Yajnopaveeta.?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0