Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central government has issued warnings regarding Aadhaar.

 Aadhaar : ఆధార్ విషయంలో ఆ పని అస్సలు చేయొద్దు. హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం .

Central government has issued warnings regarding Aadhaar.


Aadhaar: దేశంలో ప్రతీ పౌరుడుకి ఆధార్ ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వ పథకాలు మొదలు.. ఏ పని కావాలన్నా అన్నింటికీ ఆధార్ తప్పనిసరి.

బ్యాంకు ఖాతా మొదలు, రేషన్ కార్డు, ఇలా ప్రతీ అంశం ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంది. ఆధార్‌ కార్డు నెంబర్‌లో వ్యక్తి సమగ్ర సమాచారం నిక్షిప్తమై ఉంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆధార్ కార్డును దుర్వినియోగపరుస్తున్నారు. దాని నెంబర్ ఆధారంగా అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరించింది.

ఏ కారణం చేతనైనా వినియోగదారులు వారి ఆధార్ ఓటీపీ(OTP)ని, వ్యక్తిగత వివరాలను ఇతరులకు వెల్లడించొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులతో మీ ఆధార్ కార్డు వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేసింది. ఆధార్ నుంచి ఓటీపీ చెప్పమని ఎవరూ కాల్ గానీ, మెసేజ్ గానీ పంపరని తెలిపింది. ఒకవేళ మీ ఆధార్ ఈ-కార్డును వేరే కంప్యూటర్ గానీ మొబైల్‌లో గానీ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు.. పని పూర్తయిన తరువాత దానిని డిలీట్ చేయాలి. మీకు ఈ ఆధార్ కావాలంటే.. అధికారిక UIDAI పోర్టల్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

కార్డ్‌ను లాక్ చేయొచ్చు..
మోసగాళ్లు ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఆధార్ కార్డు హోల్డర్స్ తమ కార్డులను లాక్ చేయొచ్చు. అవసరమైనప్పుడు అన్‌లాక్ చేయొచ్చు. అయితే ఇది UIDAI యాప్ ధ్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందులో 16 అంకెల VID నెంబర్‌ను ఉపయోగించి లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం చేయొచ్చు. మీ మొబైల్ నెంబర్‌, ఇమెయిల్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. అలా చేయడం వల్ల మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. ఆధార్ విషయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1947 కు కాల్ చేయడం, help@uidai.gov.inకు ఇమెయిల్ చేయొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central government has issued warnings regarding Aadhaar."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0