Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CM review at camp office on management of government schools, mid-day meal and holistic nutrition programs.

 ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్‌ కార్యాలయంలో  సీఎం  సమీక్ష.

CM review at camp office on management of government schools, mid-day meal and holistic nutrition programs.


ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..

నాడు – నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యం: సీఎం

ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలి : సీఎం ఆదేశం. 

దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్న సీఎం.

మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై సమావేశంలో చర్చ.

క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలన్న సీఎం.

దీనికోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్న సీఎం. 

స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్‌ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర అన్న సీఎం.

స్కూళ్లకు, అంగన్‌వాడీలకు బియ్యాన్ని సరఫరా చేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశం.

సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్‌ బియ్యంగా లేబుల్స్‌ వేయాలన్న సీఎం.

కచ్చితంగా ప్రతినెలా ఈ నాణ్యతా పరీక్షలు జరగాలన్న సీఎం.

ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్‌కు తగిన తర్ఫీదు ఇవ్వాలన్న సీఎం. 

క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలన్న సీఎం.

చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్న సీఎం.

తయారీ దారుల వద్దా, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు... ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం. 

అలాగే గుడ్లు పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్‌ చేస్తున్నామన్న అధికారులు.

స్టాంపింగ్‌ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

నాడు – నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్‌ చేయించాలన్న సీఎం.

నిర్దేశించుకున్న అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా? లేవా?

సమకూర్చిన వాటిలో ఏమైనా సమస్యలు వచ్చాయా?

తదితర అంశాలపై ఆడిట్‌ చేయించాలన్న సీఎం.

ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలన్న సీఎం.

క్రమం తప్పకుండా ఇలా ఆడిట్‌ చేయాలన్న సీఎం.

ప్రతి ఏటా నాలుగు సార్లు ఆడిట్‌ చేయాలన్న సీఎం.

నాడు– నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రతకోసం వాచ్‌మెన్‌ నియమించాలన్న సీఎం.

నాడు – నేడు కింద కల్పించిన సదుపాయాలకు సంబంధించి వ్యారంటీ ఉన్నందున సమస్య రాగానే వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్నామన్న అధికారులు.

గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలనూ వినియోగించుకోవాలన్న సీఎం.

అంతిమంగా కలెక్టర్లు, జేసీలు... స్కూళ్ల నిర్వహణపై బాధ్యత వహించాలన్న సీఎం.

స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్‌సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలన్న సీఎం.

స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న సీఎం.

స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట రాకూడదన్న సీఎం.

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్‌ కార్యక్రమంపైనా కూడా గట్టి పర్యవేక్షణ ఉండాలన్న సీఎం. 

దీనికి కూడా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్న సీఎం. 

ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని సీఎం ఆదేశం.

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కే వి ఉషా శ్రీచరణ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఏ సిరి, సెర్ఫ్‌ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CM review at camp office on management of government schools, mid-day meal and holistic nutrition programs."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0