Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ganesh Chaturthi: Bojja Ganapayya Idol Installation Method.. Muhurtam.. Other Precautions

 Ganesh Chaturthi: బొజ్జ గణపయ్య విగ్రహ ప్రతిష్టాపన పద్ధతి. ముహూర్తం. ఇతర జాగ్రత్తలివీ.

Ganesh Chaturthi: Bojja Ganapayya Idol Installation Method.. Muhurtam.. Other Precautions

గష్టు 31వ తేదీన వినాయక చవితి పండుగ వస్తోంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు.

మొత్తం 11 రోజులపాటు జరిగే ఈ వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తారు.

ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు ఏకదంతుడిని స్మరించుకుంటారు. ఆ తర్వాతే ప్రారంభిస్తారు.

ఆగష్టు 31వ తేదీన దేవాలయాల నుంచి ప్రతి ఇంట్లో బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మొత్తం 10 రోజుల పాటు భక్తుల నుంచి పూజలందుకుంటాడు గణపయ్య. గణపతి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక పద్ధతుల్లో జరుగుతుంది. ఏ పద్దతిలో జరుగుతుంది.. ఎలాంటి ముహూర్తంలో గణపయ్యను ప్రతిష్టిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

అనుకూల సమయం : 2022 ఆగస్టు 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:34 గంటలకు చతుర్థి ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు.

గణేష్ చతుర్థి ముగింపు తేదీ: 31 ఆగస్టు బుధవారం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకు చతుర్థి ముగుస్తుంది.

గణపతి ప్రతిష్టాపన ముహూర్తం: ఆగస్టు 31 బుధవారం, ఉదయం 11 గంటల 5 నిమిషాలకు మరియు సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 01:38 నిమిషాల వరకు అనుకూలంగా ఉంది.

విగ్రహం ఏర్పాటు క్రమంలో.

  • ముందుగా విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని నీళ్లతో శుద్ధి చేయాలి
  • ఆ తర్వాత ఎర్రటి తివాచీ పరచి అక్షత్ ఉంచాలి
  • దీనిపై విగ్రహాన్ని ప్రతిష్టించాలి
  • ఆ తర్వాత వినాయకుడిపై గంగా జలం చల్లాలి
  • విగ్రహాన్ని ప్రతిష్టించేముందు , ఆ విగ్రహానికి ఇరువైపులా ఒక తమలపాకును ఉంచాలనే విషయాన్ని మరువకూడదు.
  • గణపతి విగ్రహానికి కుడి వైపున నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి
  • చేతిలో అక్షతలు మరియు పుష్పాలతో భగవంతుని ధ్యానించాలి
  • ఓం గన్ గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ganesh Chaturthi: Bojja Ganapayya Idol Installation Method.. Muhurtam.. Other Precautions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0