Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good News for PM Kisan Samman Nidhi Yojana Beneficiaries- Explanation of when the money will be disbursed

 PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు గుడ్ న్యూస్- డబ్బులు ఎప్పుడు వేస్తారో వివరణ.

Good News for PM Kisan Samman Nidhi Yojana Beneficiaries- Explanation of when the money will be disbursed

దేశంలోని 12 కోట్ల మంది రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు సెప్టెంబరులో విడుదల అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం సెప్టెంబర్ 1న చెల్లింపులు జరగవచ్చు.

ఇప్పటివరకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 11 వాయిదాలను విడుదల చేసింది. చివరగా 31 మే, 2022న పంపిణీ చేశారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై మధ్య రైతులకు మొదటి వాయిదా చెల్లిస్తారు. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య రెండో విడత, డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో మూడో విడత డబ్బులు చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని పూర్తి చేయడానికి గడువును ఆగస్టు 31, 2022 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

పీఎం కిసాన్ యోజన: లబ్ధిదారుని స్థితి, ఖాతా వివరాలను ఇలా చెక్ చేసుకోగలరు.

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి. ఇదే అధికారిక వెబ్‌సైట్‌
  • హోమ్ పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
  • ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వంటి అవసరమైన వివరాలను పొందుపరచాలి.
  • మీ స్టేటస్ గురించి పూర్తి సమాచారం కోసం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఈ పథకం ప్రయోజనాన్ని ఇంకా పొందని రైతులు ఇప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని.. అప్లికేషన్ అప్రూవల్ పొందితే సెప్టెంబర్ లో విడుదల చేసే రూ. 2000 పొందవచ్చు.

పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి వివరాలు ఇవ్వాలి. లేదా వ్యవసాయ శాఖ అధికారులను టోల్ ఫ్రీ నంబర్ - 155261, 1800115526 లేదా 011-23381092 ద్వారా సంప్రదించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good News for PM Kisan Samman Nidhi Yojana Beneficiaries- Explanation of when the money will be disbursed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0