Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How many questions are there in the presence of Face Recognition (AP Information)?

ఫేస్ రికగ్నేషన్(ముఖ ఆధారిత గుర్తింపు)హాజరులో ప్రశ్నలు ఎన్నో??(ఏపీ సమాచారం).

How many questions are there in the presence of Face Recognition (AP Information)?

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వస్తున్న  ఆన్లైన్  హాజరు ఉపాధ్యాయ లోకాన్ని కలవరపెడుతుంది.

ఆశయం మంచిది, కానీ  ఆవేశం ఆలోచనను ఇవ్వదు. ఒక ముడి విప్పబోయి మరో ముప్ఫై మూడు ముడులు వేసుకుంటే  ఇక ఎప్పటికీ ఒక ముడిని కూడా విప్పలేము. అలాగే సమస్య ఎక్కడ ఉందో గుర్తించి దానిని పరిష్కరించాలే గానీ  మొత్తం గందరగోళంగా చేసుకోకూడదు. తెలుగు సామెత లా " కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడి పోకూడదు " సమస్యల చిక్కుముడులు ?

1)ఒక టీచర్  నిర్ణీత సమయంలోనే పాఠశాల కు వచ్చిన తర్వాత  ఆసమయంలో  నెట్ వర్క్ సరిగ్గా పనిచేయక పోతే దానికి భాధ్యత ఎవరు వహించాలి.?

2) నెట్వర్క్  నెమ్మదిగా ఉండి సమయం తరువాత  రికగ్నేషన్ అయితే దానిని అంగీకరిస్తారా?

3) ముఖ్యంగా "సింగిల్  స్కూల్ ఉపాధ్యాయులు పనిచేసే చోట, ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరు CL పెట్టి మరో ఉపాధ్యాయుడు నిర్ణీత సమయంలో అటెండన్సు వేయలేక పోతే ఆరోజు C.L. అంటున్నారు.సదరు ఉపాధ్యాయుడు కి ఆ రోజు CL మార్క్ పడిపోయింది కాబట్టి ఆ రోజు  పాఠశాలలో  MDM ఎవరు చూడాలి?అటెండన్సు ఎవరువేయాలి? పాఠశాల బాధ్యత ఎవరిది ?

4)  ఆలస్యం అన్న విషయం చూస్తున్నారే గానీ ఒకరోజు  విలువైన  "మానవ వనరులను" సదరు ఉపాధ్యాయుల నుండి మనం కోల్పోతునాము అన్న విషయం మరచిపోతున్నాము?

5) ఉపాధ్యాయుడికి  ప్రత్యామ్నాయం ఏదీ లేదు అన్న విషయం  కరోనా సమయం లో ప్రపంచమంతటికీ అర్ధం అయ్యింది.

గత రెండు సంవత్సరాల కాలంలో మన విద్యార్దుల విషయంలో వారి వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులే దీనికి నిదర్శనం.ఇలాంటి సమయంలో  ఒక నిమిషం పేరు చెప్పి ఆ రోజంతా ఉత్సాహంగా బాధ్యతగా పాఠం చెప్పాలని వచ్చిన టీచర్ ను బోధనకు దూరం చేయటం ఎంతవరకూ సబబు ?

6) సమస్య లేదనం...కాదనం.

కానీ అందరినీ  ఓకే గాటన కట్టేయడం బాధాకరమైన విషయం. వ్యవస్థ బాగుండాలంటే వ్యవస్థ లో ఉండే అవస్థలు తప్పకుండా తొలగించాలి.*  *దానికి మేము కూడా సహకరిస్తాము.* *అంతేగానీ గజిబిజి గందరగోళం సృష్టించి పరిష్కారం పక్కదోవ పడితే సమస్యకు సమాధానం దొరుకుతుందా?

7) అన్ని వ్యవస్థలు వేరు....విద్యా వ్యవస్థ వేరు. విద్యా వ్యవస్థ లో ప్రశాంత వాతావరణం అన్నది చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉన్న నది పైనే పడవ ప్రయాణం సాఫీగా సాగుతుంది కానీ, అల్లకల్లోలంగా

ఉన్న నదిపై ప్రయాణం ఎలా ఉంటుందో మనకు తెలియదా ?? నాడు - నేడు తో రూపురేఖలు మార్చుకుని  మంచి సదుపాయాలతో  "బడి భలేగా ఉంది" అనిపించుకొని  తిరిగి మన ప్రయాణం లో మనమే "స్పీడ్ బ్రేకర్లు " వేసుకోవడం ఎంత వరకూ అవసరం?

8) వ్యవస్థ లో తీసుకునే చర్యలు బాధ్యతను పెంచేవిగా ఉండాలే తప్ప  భయపెట్టేవిగా ఉండకూడదు.

"ఆలోచించండి....మంచి నిర్ణయం తీసుకోండి"

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How many questions are there in the presence of Face Recognition (AP Information)?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0