Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to determine the price of gold jewelry.

 బంగారు నగల ధర ఎలా నిర్ణయిస్తారు.

How to determine the price of gold jewelry.

న భారతీయులకు బంగారం మీద ఉండే పిచ్చి అంతా ఇంతా కాదు. స్వాతంత్ర్యం ముందు నుంచే బంగారం మీద మన మహిళలకు పిచ్చి ఉండి అనేక విధాలుగా కొనే వారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారం వాడకం ఎక్కువగా ఉంటుంది.

చిన్న ఫంక్షన్ కి కూడా పెద్ద పెద్ద నగలు వేసుకుని వెళ్తూ ఉంటారు. దీనితో బంగారం షాపులు కూడా గత 20 ఏళ్ళలో ఎక్కువగానే పెరిగాయని చెప్పాలి.

ఇదిలా ఉంటే. బంగారం విషయంలో చాలా మందికి ఉండే సందేహం. ఫిక్సిడ్ రేట్ లేకుండా షాపుల వాళ్ళు అనేక రూపాల్లో బంగారం ధర ఎందుకు చెప్తారు.? దాని వెనుక ఉండే కారణాలు ఏంటో చూద్దాం. బంగారం ధర ఒకటే. అయితే. నగల ధరలు మాత్రం వాటి తయారీని బట్టి రేటు నిర్ణయించడం జరుగుతుంది. నగలు తయారు చేయడానికి ఎలాంటి పద్ధతి వాడారు అనే దాని ఆధారంగా ఉంటుంది.

కూలి, తరుగు అనేవి ప్రత్యేకంగా యాడ్ చేయడం జరుగుతుంది. ఒక మూసలో పోసి తయారు చేసే నగలకు చాలా వరకు కూలి, తరుగు అనే మాట ఉండదు. ప్రస్తుతం బంగారం తయారి యంత్రాలు పెరిగాయి. యంత్రాల సహాయంతోనే తయారు చేస్తున్నారు. అందులో కూలి అనే మాట లేదు. కాని మేకింగ్ చార్జ్ పేరుతో కొంత వసూలు చేస్తున్నారు.

నగల్లో, మంచి డిజైన్లు, నగిషీలు, రాళ్ళు లాంటివి ఉంటే గనుక. స్వర్ణకారులు చేతితో పని చేస్తారు. అప్పుడు కూలి అవసరం ఉంటుంది కాబట్టి కొంత మన నుంచి వసూలు చేస్తారు. డిజైను ఎంత క్లిష్టమైనది అయితే స్వర్ణకారుడికి అంత ఎక్కువ సమయం, నైపుణ్యం అవసరం. తన పనికి తగిన విధంగా అతను వసూలు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో చేతితోనో, చిన్న యంత్రాలతోనో నగల్ని తయారు చేస్తారు. తయారి ప్రక్రియలో ఎంతో కొంత బంగారం పొడి రాలితే. అది చెక్కే వారే తీసుకుంటారు గాని. తరుగు పేరుతో మనమే కట్టాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to determine the price of gold jewelry."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0