Indian Bank Recruitment 2022
Indian Bank Recruitment 2022 : ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు .. రాత పరీక్ష లేదు .కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా
ఇండియన్ బ్యాంక్(Indian Bank) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. వీటికి దరఖాస్తు(Application) చేసుకోవడానికి చివరి తేదీగా సెప్టెంబర్ 03, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ రిక్రూట్‌మెంట్ లో(Recruitment) మొత్తం 11 ప్రోడక్ట్ ఓనర్ పోస్టుల భర్తీకి(Product Owner Posts) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.indianbank.in ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో 03/09/2022లోపు లేదా ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్‌లు, ఇంటర్వ్యూలు మొదలైన వాటి ఆధారంగా పోస్టుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత సాధించిన అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి, వయోపరిమితి, విద్యార్హత మరియు అర్హతల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆఫ్ లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆగస్టు 20 నుంచి మొదలయ్యాయి. దరఖాస్తు ఫీజును రూ.1000గా నిర్ణయించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ అస్సెట్స్, డిజిటల్ మార్కెటింగ్, అనలిటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలను పూర్తి చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఐటీ, టెక్నాలజీ/అగ్రికల్చర్/కంప్యూటర్/సిస్టమ్ సైన్స్/మ్యాథమెటిక్స్/ఎకనామెట్రిక్స్/స్టాటిస్టిక్స్/డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మేనేజ్‌మెంట్/మార్కెటింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి.
జీతం
అభ్యర్థులకు నెలకు రూ.60వేలు ఇ్వవబడుతుంది.
వయస్సు
అభ్యర్థుల యొక్క వయస్సు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వీటికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
-కెరీర్ ఆప్షన్ పై క్తిక్ చేసి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫారమ్ లను డౌన్ లోడ్ చేసుకోవాలి.
-నోటిఫికేషన్ లో వివరాలను తనిఖీ చేసి.. అర్హత ప్రమాణాలు ఉంటే.. దరఖాస్తు ఫారమ్ లు వివరాలను నమోదు చేయాలి.
-దానిని సెప్టెంబర్ 03 లోపు రూ.వెయ్యి రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించి.. జనరల్ మేనేజర్ (CDO), ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్, HRM డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ సెక్షన్ 254-260, అవ్వై షణ్ముఖం సలై, రాయపేట, చెన్నై, తమిళనాడు - 600 014 అడ్రస్ కు పంపించాలి.
0 Response to "Indian Bank Recruitment 2022 "
Post a Comment