Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sravana masam 2022

 Sravana masam 2022 : శ్రావణ శుక్రవారం ప్రత్యేకతలేంటి? ఈరోజున నవ వధువుతో వ్రతం ఎందుకు చేయిస్తారు?

Sravana masam 2022

Sravana masam 2022 : మన తెలుగు మాసాల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జూలై 28వ తేదీన ఆషాఢ మాసం పూర్తయి, 29వ తేదీన శ్రావణ మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఈ ఏడాది శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టే దీనికి శ్రావణమనే పేరు వచ్చింది. శ్రీ మహా విష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే. అందుకే దీన్ని శ్రీ లక్ష్మీ నారాయణ మాసంగా భావిస్తారు. ఈ నెలలో సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాల పూజలు, నోములు, వ్రతాలతో దాదాపు నెలరోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ నెలలో శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ కాలంలో చంద్రుని నుండి కలిగే అశుభ ఫలితాల నుండి తప్పించుకునేందుకు, మానసిక శాంతిని కాపాడుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రావణ మాసంలో అనేక పండుగలు, పూజలు, వ్రతాలు జరుపుకుంటారు.

​పౌర్ణమి ముందు.

హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మంగళ గౌరి దేవిని కలశ రూపంలో ప్రతిష్టించి, మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. రక రకాల పిండి వంటలతో పాటు పండ్లను, పూలను అమ్మవారికి సమర్పిస్తారు. కొందరు తమ ఇళ్లల్లోనే ముత్తయిదవులను ఆహ్వానించి వ్రతాన్ని చేస్తారు.

​లక్ష్మీ పూజ.

ఈ నెలలో అన్నింటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీకి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, తమకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని చాలా మంది నమ్ముతారు.

లక్ష్మీ అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు. అయితే లక్ష్మీ అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది. అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు.

​వరలక్ష్మీ వ్రతం.

ఈ నెలలో పెళ్లిళ్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. నవ వధువుతో అత్తగారింట్లో వరలక్ష్మీ వ్రతం చేయిస్తారు. ఈ సందర్భంగా తనకు పూజలు, వాటి విధానం, అమ్మవారి ప్రాముఖ్యత గురించి తెలుస్తుందని భావిస్తారు. మరీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు పూజ చేయడం వల్ల తమ కుటుంబానికి సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు.

​చారుమతీ కథ.

వ్రతంలో భాగంగా నవ వధువుకు చారుమతీ గురించి వివరిస్తారు. పురాణాల ప్రకారం, చారుమతి అనే స్త్రీ ఎల్లప్పుడూ నిండు కుండలా అణకువగా ఉంటుందని, అత్తమామలను బాగా చూసుకుంటుందని, అలాంటి మహిళలకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతారు. ఇదే విధంగా కొత్త పెళ్లికూతురు తన అత్తమామలను మంచిగా చూసుకోవాలని, అప్పుడు తనకు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

ఏ కుటుంబంలో అయితే మహిళలు ఇంటిని శుభ్రంగా, శాంతంగా ఉండేలా చూసుకుంటారో, అలాంటి వారి ఇంట్లో అన్నీ పనులు సరైన సమయానికి విజయవంతంగా పూర్తవుతాయని చాలా మంది నమ్మకం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sravana masam 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0