Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Stenographer Exam

 SSC Stenographer Exam : ఇంటర్ అర్హతతో ' స్టెనోగ్రాఫర్ ' ఉద్యోగాలు , వెంటనే దరఖాస్తు చేసుకోండి !

SSC Stenographer Exam

SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2022


అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.

వయోపరిమితి:
01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాలు, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు) లేదా SBI చలానా ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా.
పరీక్ష విధానం.
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.
పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.

సదరన్ రీజియన్‌లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.08.2022
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 05.09.2022 (23:00)
  • ఆఫ్‌లైన్ చలనా జనరేషన్‌కు చివరితేదీ: 05.10.2022 (23:00)
  • ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 06.09.2022 (23:00)
  • చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 06.09.2022.
  • దరఖాస్తుల తప్పుల సవరణ తేదీ: 07.09.2022 (23.00)
  • ఆన్‌లైన్ రాతపరీక్ష: 2022, నవంబరులో.


WEBSITE : https://ssc.nic.in/

NOTIFICATION



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Stenographer Exam "

Post a Comment