UGC: Line clear for practicing professors.. UGC green signal for universities.. Details of new guidelines
UGC: ప్రాక్టీస్ ప్రొఫెసర్లకు లైన్ క్లియర్.. యూనివర్సిటీలకు యూజీసీ గ్రీన్ సిగ్నల్.. కొత్త గైడ్‌లైన్స్ వివరాలు
UGC: అద్భుతమైన ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఉన్న ఇలాంటి వారికి, అధికారిక ఎడ్యుకేషన్ కాల్విఫికేషన్స్ తప్పనిసరి కాదు. అలాగే ప్రొఫెసర్ స్థాయిలో అధ్యాపకుల నియామకం కోసం నిర్దేశించిన ఇతర అర్హత ప్రమాణాల నుంచి కూడా వీరికి మినహాయింపు ఇవ్వనున్నారు.
యూనివర్సిటీలు ప్రాక్టీస్ ప్రొఫెసర్ల(Practice Professors)ను నియమించుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు(Guidelines) జారీ చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు ఇప్పుడు ప్రొఫెసర్‌గా మారడానికి, ఎటువంటి బీఈడీ డిగ్రీ లేదా NETను క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ (Experience) ఉంటే చాలు. కనీసం 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో తమ నిర్దిష్ట వృత్తిలో నైపుణ్యాన్ని నిరూపించుకున్న అభ్యర్థులు, ప్రాధాన్యతన పరంగా సీనియర్ స్థాయిలో ఉన్నవారు ప్రాక్టీస్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులని యూజీసీ పేర్కొంది.
ప్రధానంగా ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాణిజ్యం, సామాజిక శాస్త్రాలు, మీడియా, సాహిత్యం, లలిత కళలు, పౌర సేవలు, సాయుధ దళాలు, న్యాయవాద వృత్తి, ప్రజా పరిపాలన వంటి రంగాల్లో విశేష కృషిచేసిన నిపుణులు, దేశంలోని వర్సిటీల్లో పాఠాలు చెప్పడానికి అర్హులు. అయితే ప్రస్తుతం టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నవారు లేదా రిటైర్డ్ అయిన వారికి ఈ అవకాశం ఉండదు.
అద్భుతమైన ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఉన్న ఇలాంటి వారికి, అధికారిక ఎడ్యుకేషన్ కాల్విఫికేషన్స్ తప్పనిసరి కాదు. అలాగే ప్రొఫెసర్ స్థాయిలో అధ్యాపకుల నియామకం కోసం నిర్దేశించిన ఇతర అర్హత ప్రమాణాల నుంచి కూడా వీరికి మినహాయింపు ఇవ్వనున్నారు. అయితే విధులు, బాధ్యతలను నిర్వర్తించే నైపుణ్యాలు వారికి తప్పనిసరిగా ఉండాలని యూజీసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు, పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి ప్రాక్టీస్ ప్రొఫెసర్లు అవసరం. వారు ఒక సంవత్సరం నిర్ణీత కాలవ్యవధికి రిక్రూట్ కానున్నారు. అయితే సర్వీస్ ఆధారంగా నాలుగు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. మంజూరైన పోస్టుల సంఖ్య, రెగ్యులర్ ఫ్యాకల్టీ సభ్యుల రిక్రూట్‌మెంట్‌పై దీని ప్రభావం ఉండదని యూజీసీ స్పష్టం చేసింది. కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రాక్టీస్ ప్రొఫెసర్ల సంఖ్య, ఏ సమయంలోనైనా మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.
రియల్ వరల్డ్ ప్రాక్టీస్, అనుభవాలను తరగతి గదుల్లోకి తీసుకువెళ్లడానికి, అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల వనరులను పెంచడానికి ప్రాక్టీస్ ప్రొఫెసర్లు సహాయపడనున్నారు. సంబంధిత నైపుణ్యాల కోసం శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ల ద్వారా పరిశ్రమ, సమాజం ప్రయోజనం పొందుతుందని యూజీసీ పేర్కొంది.
అయితే యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్నత విద్య నాణ్యతను ఇది పలుచన చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని ఢిల్లీ టీచర్స్ అసోసియేషన్ (డీటీఏ) పేర్కొంది. పరిశోధనల నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో, ప్రభుత్వం ఒకవైపు నాణ్యమైన విద్య గురించి చెబుతూనే, మరోవైపు డిగ్రీ లేని ప్రొఫెసర్లను నియమించాలని యూజీసీ సలహా ఇస్తోందని డీటీఏ విమర్శించింది.
0 Response to "UGC: Line clear for practicing professors.. UGC green signal for universities.. Details of new guidelines"
Post a Comment