Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vacation Plan

 Vacation Plan: విహార‌యాత్ర‌కు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా?

Vacation Plan

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది కొవిడ్ వ‌ల్ల సుమారుగా 2 సంవ‌త్స‌రాల నుంచి అత్య‌వ‌స‌ర కార్య‌క్రమాల‌కు త‌ప్ప విహార‌ యాత్రలకు వెళ్ల‌డం దాదాపుగా మానుకున్నారు. లాక్‌డౌన్‌ల స‌మ‌యంలో చాలా మంది ఆదాయం దెబ్బ‌తిన‌డంతో విహార యాత్ర‌ల‌కు నిధులు స‌మ‌కూర్చుకోవ‌డం కూడా ప్ర‌ధాన స‌మ‌స్య అయ్యింది. ఇప్పుడిప్పుడే ట్రావెల్‌, టూరిజం ప‌రిశ్ర‌మ మ‌ళ్లీ జీవం పోసుకుంటోంది. చాలా రాష్ట్రాలు, దేశాలు ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను చాలా వ‌ర‌కు స‌డ‌లించాయి. అయితే, విహార యాత్ర‌ల‌కు త‌గిన స‌మ‌యం, డ‌బ్బుతో పాటు ప్రణాళిక కూడా చాలా ముఖ్యం. దీనికి త‌గిన బ‌డ్జెట్‌ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.

ముంద‌స్తు బుకింగ్‌: మీ ప్ర‌యాణం కోసం ముంద‌స్తు బుకింగ్‌లు చేయ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు ఖ‌ర్చులు త‌గ్గుతాయి. కాబ‌ట్టి, ప్ర‌యాణాల‌కు ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త అవ‌స‌రం. బ‌య‌టి ప్రాంతాల‌కు వెళ్లిన ప్ర‌తిసారీ మ‌నం అనుకున్న‌ బ‌డ్జెట్లోనే అన్ని ప‌నులు అయిపోవు. కాబ‌ట్టి ముందుగా మ‌నం వెళ్లే ప్రాంతాల‌ను బ‌ట్టి బ‌డ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటే అధిక ఖ‌ర్చుల‌ను నివారించ‌వ‌చ్చు. యాత్ర కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మీ ప్ర‌యాణ నిధి కోసం డ‌బ్బు ఆదా చేయ‌డం ప్రారంభించ‌వ‌చ్చు. ఇందుకు మీ నెల‌వారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఈ ట్రిప్ కోసం కేటాయించ‌వ‌చ్చు. ముందుగా సిద్ధప‌డ‌డం వ‌ల్ల మంచి డీల్స్‌, డిస్కౌంట్‌లు, ఆఫ‌ర్ల‌ను పొంద‌గ‌లుగుతారు. బ‌డ్జెట్‌లో ఉంటూనే తుది గ‌మ్యాన్ని, ప‌ర్య‌ట‌నను ఆస్వాదించ‌వ‌చ్చు. త‌క్కువ ర‌ద్దీ ఉన్న సమయంలో వసతి, ఫ్లైట్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.

కరెన్సీ మార్పిడి: అంత‌ర్జాతీయ విహార యాత్ర చేయాల‌నే యోచ‌న ఉంటే ఆ దేశంలో చేసే ఖ‌ర్చుల కోసం క‌రెన్సీని ముందుగానే కొనుగోలు చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్‌ బ్యూరోలు అధిక మారకపు ధరలను వసూలు చేసే అవకాశం ఉంది. ఇది మీ మొత్తం బ‌డ్జెట్‌ను తారుమారు చేస్తుంది. 

ప్రీపెయిడ్ కార్డ్‌: ప్ర‌యాణానికి ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్‌ను ఉప‌యోగించ‌డం మంచిది. దీంతో బ‌డ్జెట్‌లోనే ఖ‌ర్చులు ప‌రిమితం చేసే వీలుంటుంది. అలాగే, విదేశీ ద్ర‌వ్య మార్పిడి ధ‌ర‌ల హెచ్చుత‌గ్గుల నుంచి ర‌క్షిస్తుంది. డ‌బ్బు మొత్తాన్ని ఒకే పద్ధతిలో కాకుండా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌, ట్రావెల‌ర్స్ చెక్‌లు, న‌గ‌దు వంటి వివిధ‌ రూపాల‌లో తీసుకెళ్ల‌డం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల సాంకేతిక కార‌ణాల‌తో చివ‌రి నిమిషంలో ఎదుర‌య్యే ఇబ్బందులను నుంచి కూడా త‌ప్పించుకోవ‌చ్చు.

రివార్డ్ పాయింట్లు: విహార యాత్ర‌లలో క్రెడిట్ కార్డ్‌ల మీద‌ అనేక రివార్డ్ పాయింట్‌లు, డిస్కౌంట్‌లు ల‌భించే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా కొన్ని క్రెడిట్ కార్డ్‌ల‌కు టూరిజం స్పాట్‌ల‌లో వ‌స‌తి, భోజ‌నం, ఇంకా ఇత‌ర ఏర్పాట్ల‌కు అనేక రాయితీలు వ‌స్తుంటాయి. మీ ట్రిప్‌ని బుక్ చేసేట‌ప్పుడు క్రెడిట్ కార్డ్‌ని ఉప‌యోగించి అనేక ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

ఆర్థిక వ‌న‌రుల‌ను ఎలా స‌మ‌కూర్చుకోవాలి?: విహార యాత్ర‌కు వెళ్లాల‌నుకునేవారు ప్ర‌యాణ టికెట్‌ల బుకింగ్‌, వ‌స‌తి, రోజువారీ ఖ‌ర్చులకు నిధులు స‌మ‌కూర్చుకోవ‌డానికి ఒక సంవ‌త్స‌రం ముందుగానే ప్లాన్ చేసుకోవ‌డం మంచిది. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని క‌నీసం 8-12 నెల‌ల స‌మ‌యంలో డబ్బుని ఆదా చేయాలి. డ‌బ్బుని పొదుపు చేయ‌డానికి ఎఫ్‌డీ, రిక‌రింగ్ డిపాజిట్లు, చిట్స్, ఉద్యోగంలో ల‌భించే బోన‌స్‌ వంటి వాటిపై ఆధార‌ ప‌డొచ్చు.

చివ‌రిగా: విహార యాత్ర‌లు అత్య‌వ‌స‌ర ఖ‌ర్చుల్లోకి రావు కాబ‌ట్టి ముందు నుంచే ప్ర‌ణాళిక‌తో పొదుపు ప‌ద్ధ‌తులు పాటించి డ‌బ్బులు వెన‌కేయ‌డం అవ‌స‌రం. రుణాల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vacation Plan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0