Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Alert: These are the new changes coming from October 1st.. These users should be alert..

Alert : అక్టోబర్ 1 వ తేదీ నుంచి రానున్న కొత్త మార్పులు ఇవే .. ఈ యూజర్లు అలెర్ట్ ఉండాల్సిందే.

Alert: These are the new changes coming from October 1st.. These users should be alert..

 క్టోబర్ 1వ తేదీ నుంచి మార్పులు అమలు కానున్నాయి. వీటితో పాటు టోకనైజేషన్‌, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్ (ఎన్‌పీఎస్‌), అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకాల్లోని మారిన నిబంధనల గురించి తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డు కావాలంటే

వినియోగదారుల భద్రతే లక్క్ష్యంగా ఆర్బీఐ ఈ ఏడాది జులై నుంచి డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డులపై ఎప్పుటికప్పుడు మార్పులు చేస్తూ వస‍్తుంది. తాజాగా ఆర్బీఐ క్రెడిట్‌ కార్డుల జారీ అంశంలో కొత్త నిబంధనల్ని తెచ్చింది. ఆ నిబంధనల ప్రకారం.. అక్టోబర్‌ 1 నుంచి క్రెడిట్‌ కార్డుల జారీ సంస్థలు.. లబ్ధి దారులకు కార్డు జారీ చేసే ముందు వారి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా పొందాల్సి ఉంటుంది. లేదంటే 30 రోజుల తర్వాత కార్డు బ్లాక్‌ అవుతుంది. అలాగే వినియోగదారుడి అనుమతి లేకుండా క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను పెంచవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

పన్ను చెల్లింపు దారులకు షాక్‌

పన్ను చెల్లింపు దారులు అక్టోబర్‌ 1 లోపు అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకంలో చేరే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 లేదా ఆ తర్వాత నుంచి చేరేందుకు అనర్హులని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఒకవేళ అక్టోబర్‌ 1 న ఏపీవైలో చేరితే ఆ ఖాతాను బ్లాక్‌ చేసి, డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. సామాన్యులకు మెరుగైన పెన్షన్ అందించటమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఖాతా దారులకు గుడ్‌న్యూస్‌
నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఖాతా దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలరేటరీ అండ్‌ డెవలప్మెంట్ అథారటీ ( పీఎఫ్‌ఆర్డీఏ) ఆదేశాల ప్రకారం.. అక్టోబర్‌ 1 నుంచి పెన్షన్‌ స్కీమ్‌ ఖాతాదారులు చేసిన ఈ-నామినేషన్‌ను నోడల్‌ కార్యాలయం అధికారులు 30 రోజుల వ్యవధిలో యాక్సెప్ట్‌ చేయొచ్చు. లేదంటే రిజక్ట్‌ చేయొచ్చు. 30 రోజులు పూర్తయిన అధికారులు స్పందించకపోతే సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ( సీఆర్‌ఏ) సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఈ-నామినేషన్‌ ఆమోదం పొందుతుంది.

డీ మ్యాట్‌ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయాలంటే డీమ్యాట్‌ అకౌంట్‌ తప్పని సరి. అయితే ఈ డీమ్యాట్‌ అకౌంట్‌పై స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ (సెబీ) ఈ ఏడాది జూన్‌ 14న సర్క్యూలర్‌ను పాస్‌ చేసింది. ఆ సర్క్యూలర్‌ ప్రకారం.. డీ మ్యాట్‌ టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ను సెప్టెంబర్‌ 30,2022లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అకౌంట్‌ను ఓపెన్‌ చేసేందుకు ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు బయో మెట్రిక్‌ అథంటికేషన్‌ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది.

రెపో రేటు మాత్రం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ సమీక్ష సమావేశం వచ్చే వారంలో జరగనుంది. సెప్టెంబర్ 30న జరిగే ఈ సమావేశంలో వడ్డీ రేటును ప్రకటించనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో వడ్డీ రేటును పెంచే అవకాశం ఉంది. అందువల్ల, రుణాలు ఖరీదైనవి.

గృహ గ్యాస్ సిలిండర్ ధర మారవచ్చు.

ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. పెట్రోలియం కంపెనీలు అక్టోబర్ 1న LPG సిలిండర్ ధరలను మార్చవచ్చు. ఒకవేళ కంపెనీ ఎల్‌పిజి ధరను మార్చినట్లయితే, ధరలు తగ్గే లేదా పెరిగే అవకాశం ఉంది.

మ్యూచువల్ ఫండ్‌లో
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) కొత్త నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 1వ తేదీ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు నామినేషన్ సమాచారం ఇవ్వడం తప్పనిసరి. అలా చేయడంలో విఫలమైన పెట్టుబడిదారులు డిక్లరేషన్ ఫారమ్‌ను పూరించాలి. నామినేషన్ సదుపాయాన్ని తాము పొందబోమని ప్రకటించాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో నామినేషన్ అవసరం. మీరు మ్యూచువల్ ఫండ్‌లో నామినేషన్ పొందకపోతే, మీరు దాని కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

చిన్న పొదుపుపై అధిక వడ్డీ.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత బ్యాంకులు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీని పెంచాయి. అటువంటి పరిస్థితిలో పోస్టాఫీసుకు చెందిన రికరింగ్ డిపాజిట్ (RD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇతర చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సెప్టెంబర్ 30న ప్రకటించనుంది. ఇది జరిగితే చిన్న పొదుపుపై కూడా ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుందని గుర్తించుకోవాలి.

ఎన్‌పిఎస్‌లో ఇ-నామినేషన్ తప్పనిసరి.

PFRDA ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ లేదా కార్పొరేట్ రంగ ఉద్యోగుల కోసం ఇ-నామినేషన్ ప్రక్రియను మార్చింది. ఈ మార్పు అక్టోబర్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. కొత్త NPS ఈ-నామినేషన్ ప్రక్రియ ప్రకారం.. NPS ఖాతాదారు ఈ-నామినేషన్ అభ్యర్థనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి నోడల్ కార్యాలయం ఎంపికను కలిగి ఉంటుంది. నోడల్ ఆఫీస్ దాని కేటాయింపు నుంచి 30 రోజులలోపు అభ్యర్థనపై ఎటువంటి చర్యను ప్రారంభించకపోతే ఈ-నామినేషన్ అభ్యర్థన సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీల (CRAs) వ్యవస్థలో ఆమోదించబడుతుంది.
SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Alert: These are the new changes coming from October 1st.. These users should be alert.."

Post a Comment