Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

5008 Junior Associate Posts in SBI. Full details

SBI లో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు.  పూర్తి వివరాలు 

5008 Junior Associate Posts in SBI.  Full details

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ లో 225 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు: జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)

మొత్తం పోస్టులు: 5008.

సర్కిల్ వారీగా ఖాళీలు:

  • అహ్మదాబాద్- 357
  • బెంగళూరు- 316
  • భోపాల్- 481
  • బెంగాల్- 376
  • భువనేశ్వర్- 170
  • చండీగఢ్- 225
  • చెన్నై- 362
  • దిల్లీ- 152
  • హైదరాబాద్- 225
  • జైపూర్ - 284
  • కేరళ- 273
  • లఖ్నవూ/దిల్లీ - 631
  • మహారాష్ట్ర/ముంబయి మెట్రో- 747
  • మహారాష్ట్ర- 50
  • నార్త్ ఈస్టర్న్- 359

విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1994 - 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

బేసిక్ పే: నెలకు రూ.19900.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది.

మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి. 

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022.
  • దరఖాస్తులకు చివరి తేది: 27.09.2022.
  • ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2022లో జరుగుతుంది.
  • మెయిన్ పరీక్ష తేది: డిసెంబర్ 20221 / జనవరి 2023లో జరుగుతుంది.


WEBSITE :  https://sbi.co.in/

NOTIFICATION

APPLY HERE




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "5008 Junior Associate Posts in SBI. Full details"

Post a Comment