Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you buying things in festival sales?.. But you must know these tips.

ఫెస్టివల్ సేల్స్‌లో వస్తువులు కొంటున్నారా? అయితే ఈ టిప్స్ తప్పక తెలుసుకోగలరు.

Are you buying things in festival sales?.. But you must know these tips.

ఈ-కామర్స్ వెబ్‌సైట్లు (E-commerce), ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు ఇప్పటికే ఫెస్టివల్ సేల్స్‌ షురూ చేశాయి. వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈ సేల్స్‌లో కస్టమర్లకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, మింత్రాతోపాటు ఇతర సంస్థలు ఆకర్షణీయ డీల్స్, క్యాష్ బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొనుగోలు చేసే ముందు వినియోగదారులు పరిగణలోకి తీసుకోవాల్సిన పలు అంశాలున్నాయి. అవేంటో మీరు కూడా తెలుసుకోండి.

వస్తువుని కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించి రివ్యూలను చెక్ చేసుకోవాలి. తద్వారా ఆ ప్రొడక్ట్ పనితీరుపై మీకో అభిప్రాయం కలుగుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. బయట స్టోర్ల(Physical stores)లో ధరలను ఆన్‌‌లైన్ ధరలతో పోల్చిచూసుకోవడం మంచిది. బీఎన్‌పీఎల్(బై నౌ.. పే లేటర్), ఈఎంఐ కాస్ట్ లేని ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. లేదంటే మీరు డెట్(debt) ట్రాప్‌లో పడే అవకాశాలుంటాయి. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కదా అని వస్తువులు కొనుగోలు చేయడం ఉపయోగకరం కాదు. అవసరమైన వస్తువుని మాత్రమే కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు ల్యాప్‌ట్యాబ్‌ని తీసుకుంటే.. ప్రస్తుతం వాడుతున్నదానిని అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటే చేసుకుని వాడండి. అప్‌‌గ్రేడ్ చేయించుకున్నా మీ ల్యాప్‌ట్యాబ్ పనితీరు మెరుగయ్యే అవకాశాలుంటాయి. కానీ తక్కువకే వస్తుందనే ఆలోచనతో కొత్తది కొనుగోలు చేస్తే ఆర్థికంగా మీపై ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితికి కంపెనీ ఆఫర్లు, డిస్కౌంట్ల నోటిఫికేషన్లే కారణమవుతున్నాయి. కాబట్టి వేర్వేరు ఆన్‌లైన్ సేల్స్ కంపెనీల యాప్స్ పుష్ నోటిఫికేషన్స్ ఆపివేయడం ఉత్తమమో పరిశీలించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you buying things in festival sales?.. But you must know these tips."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0