Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

ఈ తెలంగాణా వణితకు సెల్యూట్.ఆడపిల్ల అయినా కుటుంబం కోసం ఆమె చేసిన సాహసం.

Inspiration


 జీవితం ఒక్కొక్క సారి మనిషిని చాలా క్రూరంగా పరీక్షించాలనుకుంటుంది. ఇలాంటి కఠిన పరీక్ష ఎదురయినపుడు అంతా క్రుంగిపోతారు. అయితే, ఆ పైన కొందరే ధైర్యంగా, వీరోచితంగా ఈ పరీక్షని ఎదుర్కొని నెగ్గి అజేయులవుతారు. వాళ్లొక ట్రెండ్ సృష్టిస్తారు. ఇలాంటి పరీక్షలో నెగ్గిన వాళ్లు మహిళలయితే, వారి కథ మరీ  ఉత్తేజకరంగా ఉంటుంది. ఇలాంటి ఉత్తేజకరమయిన మహిళ కథ ఒకటి తెలంగాణ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చింది.

ఆ జిల్లాలో మొండికుంట అనే గ్రామంలో ఒక సెలూన్ ఉంది.  ఇపుడు మీరు ఆ సెలూన్ కు క్రాప్ చేయించుకునేందుకు, షేవ్ చేయించుకునేందుకు వెళితే, షాక్ తింటారు. అక్కడ ఒక మహిళ సెలూన్ ను నడుపుతూ ఉంటుంది. ఆమె నిజానికి కాలేజీ విద్యార్థి.   కుటుంబంలోకి అనుకోని సంక్షోభం రావడంతో ఆమె  సెలూన్ నిర్వహణకు పూనుకుంది.

పొద్దునే సెలూన్ కు వస్తుంది. పనిచేస్తుంది. నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలబడింది. ఈ ఎంతో సాహసోపేత నిర్ణయం. ఆమె పేరు మేడిపల్లి బిందుప్రియ.  ప్రస్తుతం బిబిఎ చదువుతూ ఉంది. ఇపుడామె సెలూన్ నడుపుతూ మధ్య మధ్య బ్రేక్ తీసుకుని క్లాసులకు వెళుతూ ఉంది. 

చాలా మంది అమ్మాయిల్లాగే బిందుప్రియ కూడా జీవితం గురించి కలలు కంది. జీవితానికి ఒక పెద్ద గోల్ పెట్టుకుంది. ఇలాంటపుడు వాళ్ల ఇంటిని రెండు పెను సంక్షోభాలు తాకాయి. ఒకటి తల్లి చనిపోవడం, రెండో తండ్రి ఆసుప్రతి పాలుకావడం. అంతే  కాలేజీలో చదవుకుంటూ వుండాల్సిన అమ్మాయి పల్లెటూర్లో   క్షురశాల నడుపుతూ ఉంది. ఇలాంటి పని చేస్తున్నందుకు ఆమె నామోషి పడటం లేదు. చిన్నతనంగా భావించడం లేదు సరిగదా, తానొక గొప్ప కర్తవ్యం నెరవేరుస్తున్నట్లు, ఒక సుదూరపు కలని చేరుకునేందుకు ఒకొక్క అడుగు వేస్తున్నట్లు ఫీలవుతూ ఉంది. ఆమె సుదూరపు కల ఐఎఎస్ పరీక్ష పాసవడం.

బిందు ప్రియ ఎందుకు కత్తి పట్టింది?

ఆ మధ్య బిందుప్రియ తండ్రికి స్ట్రోక్ వచ్చింది. దాంతో ఆయనను హైదరాబాద్ తరలించాల్సివచ్చింది. ఆయన చికిత్స చేయించుకుంటున్నారు. ఇక ఆయన తన సెలూన్ నడపలేని పరిస్థితి వచ్చింది. సెలూన్ మూత పడింది. సెలూన్ ఆ కుటుంబానికి బతుకుదెరువు. అది మూత పడటానికి వీల్లేదు.  వూరికి ఆసెలూన్ ఒక ఆదరువు అయితే, ఊరు కుటుంబానికి ఆదరువు. అందుకు మందు వెనక ఆలోచించకుండా, ‘అయ్యో,ఆడపిల్ల సెలూన్ల కెళ్లి మగవాళ్లకి క్రాప్ చేయడం, గడ్డం గీయడం ఏమిటి’ అని  సంశయపడకుండా కత్తి పట్టింది. ఇది ఊరంతా షాకింగ్ న్యూస్.

హఠాత్తుగా ఒక మహిళ, అందునా యుక్త వయసులో ఉన్న మహిళ సెలూన్ లో కత్తి పట్టి గడ్డాలు మీసాలు ట్రిమ్ చేస్తూ ఉండటం వింతగానే కాదు,  కొంత ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తుంది.

భారతీయ సమాజం ఇంకా  ఇలాంటి వృత్తులలో మహిళలను చూడలేదు. మరొక రకమయిన క్షుర వృత్తిలోకి మహిళలు వచ్చారు. దానిని క్షుర వృత్తి అనడానికి వీల్లేదు. అవన్నీ బ్యూటీపార్లర్లు. అక్కడ  హీనభావానికి చోటులేకుండా ఆదునిక పద్దతులలో వెలసిన సౌందర్యశాలలు.  అవికులా తీతమయినవి. అదొక పట్టణ వ్యాపారమయింది.  ఈ విద్యులోకోర్సలొచ్చాయి. వాటిని నేర్చుకునేందుకు అన్ని కులాల మహిళలు పోటీ పడుతున్నారు. ఈ వృత్తి బాగా గౌరవం దక్కింది.

అంతే  తప్ప సాధారణ సెలూన్లను నడిపే స్థాయి ఎక్కడా కనిపించదు. ఈ వృత్తి ఎంతో ముఖ్యమయినదే అయినా, గౌరవప్రదంగా చూడటం ఇంకా జరగ లేదు.  అందునా గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి ఇంకా అధ్వాన్నం. కాబట్టి సాంప్రాదాయిక వృత్తి అయిన  క్షురశాల నడుపడటంలో  బిందు ప్రియ తెలుగు రాష్ట్రాలలో నెంబర్ వన్ అనక తప్పదు.

జీవితంతో ఇలాంటి సంక్షోభం ఎదురయినపుడు చాలా మంది పేద మహిళలు ఆటోడ్రైవర్లు, బస్ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అయ్యారు. కాడిపట్టి సేద్యం చేసే మహిళలు ఉన్నారు. రిక్షా తొక్కే వారు అయ్యారు. కొన్ని కులవృత్తుల్లోకి మహిళలు ఎపుడో ప్రవేశించారు. ఉదాహరణకు చేనేత రంగంలో మహిళలు ఎప్పటి నుంచో మగ్గాలు నేస్తున్నారు. ఇలాగే టైలరింగ్ ని మహిళలు డామినేట్ చేస్తున్నారు. మహిళలు ఇంకా ప్రవేశించని వృత్తులలో క్షుర వృత్తి ఒకటి. ఇది కేవలం పురుషుల, పురుషులకు మాత్రమే అందించేసేవే కాబట్టి, అందునా చాలా సమీపాన్నుంచి అందించే సేవ కాబట్టి మహిళలకు అనుకూలంగా వుండదు.

కుల వృత్తులలో ఈ వృత్తి పట్ల ఇప్పటికీ సమాజంలో అంత మంచి భావన లేదు.  కార్పొరేట్ క్షుర శాలలు వస్తూండటంతో ముందు ముందు ఈ వృత్తి పట్ల కూడా సమాజంలో అభిప్రాయం మారవచ్చు.ఏమయినా ప్రస్తుతానికి మన సొసైటీలో మహిళలకు క్షుర వృత్తి గౌరవ ప్రదంగా అనిపించదు.  అందుకే మహిళలు ప్రవేశించలేకపోయారు.

ఇలాంటి నేపథ్యంలో బిందు ప్రియ ధైర్యంగా క్షుర శాలను నడిపి కుటుంబాన్ని పోషిస్తూ తన చదువుకు కొనసాగించాలనుకోవడం ప్రశంసనీయం.  ఉర్లో ఆమె నిర్ణయం పట్ల  సానుభూతి కూడా ఉంది

కాలేజీకి వెళ్లాల్సిన బిందు ప్రియ ఇలా సెలూన్ నడపడేందుకు పూనుకోవడం మొండికుంటలో సంచలనం సృష్టించింది. పెద్ద వాళ్లు ఆమె పట్ల చాలా సానుభూతితోనే ఉన్నారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని, ఎలాంటి సమస్యలేదని ఆమె చెప్పింది. అయితే,  కొందిరికి ఆమె ఇలాంటి వృతిలోకి ప్రవేశించడం ఇష్టం లేదు. “మగవాళ్లకు గడ్డాలు మీసాలు గీయడం, హేర్ కట్ చేయడం ఏమిటి? ఒక మహిళ మగవారికి ఇలాంటి సేవలందించడం ఏమిటి?” అని ఎబ్బెట్టు ఫీలవుతున్నారని బిందు చెప్పింది.

“అయితే,ఇరుగు పొరుగు వారి మాటలకు,చూపులకు అనుగుణంగా నడిస్తే బతుకుబండి ముందుకు సాగదు. నేను కుటుంబాన్నిపోషించాలి. పోషించే శక్తి ఉంది. పోషించే  నైపుణ్యం ఉంది. అందువల్ల ఎవరే మనుకున్నానేను సెలూన్ నడపక తప్పదు. ప్రస్తుతానికి ఇదొక్కటే నాకు అందుబాబులో ఉన్న విద్య,” అని సమాధాన పర్చుకుంది.

సరే, కుర్రకారు అసభ్య వ్యాఖ్యలు ఉండనే ఉంటాయి. వాటినీ ఆమె లెక్క చేసే పరిస్థితి లేదు. ముందుకు సాగిపోవడేం లక్ష్యం అనుకుంది.

"ఇలా వ్యాఖ్యలు చేసే  వారితో  చికాకు పెట్టే పరిస్థితి ఎదురవుతుందని నాకు తెలుసు. అయితే, దీని మీద నేను ఎవరికీ ఫిర్యాదు చేయాలనుకోవడం లేదు. పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, అధిగమించాలో నాకుతెలుసు,” అని ధీమా వ్యక్తం చేసింది.

బిందు ప్రియకు గత్యంతరం లేదు

బిందు ప్రియ  ఈ విద్యను తండ్రి నుంచే నేర్చుకుంది. మెలకువలను చూసే నేర్చుకుంది. ఇంటి దగ్గర నుంచి తండ్రికి భోజనం తీసుకుని సెలూన్ కు వచ్చినపుడు ఆయన  పని చేసే తీరుని  జాగ్రత్తగాగమనించేంది. అలా ఆమె గెడ్డం గీయం, హేర్ కట్ చేయడం  పరిచమయ్యాయి. దీనితో తనకు తెలిసిన విద్యను  నాలుగు డబ్బులు సంపాదించేందుకు , తండ్రి బబ్బు పడగానే ఆనుకుంది. తన సెలూన్ నడపంలో ఎవరీ ప్రోద్బలంలేదని, ఇది స్వచ్చందనిర్ణయమని ఆమె చెప్పారు.

మరొక  బాధకరమయిన విషయమేమింటే, బిందుప్రియకు తల్లి లేదు. ఆమె గత ఏడాది చనిపోయింది. ఒక అక్కకు పెళ్లయింది. రెండో అక్క ఇపుడే పిజి చేస్తూ ఉంది. ఇక ఇంటికి తక్షణం ఏమయినా చేయగలిగింది తనే. తండ్రి ఇంకా చికిత్సలోనే ఉన్నాడు. దానికి తోడు తనకీ ఒక జీవిత లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం చేరుకునేందుకు కొంతయినా డబ్బుకావాలి. దాని నిజాయితీగా, తనకు తెలిసిన విద్య ద్వారా ఆర్జించాలి. దీనికి సెలూన్ అనువయింది. ఇపుడామే రోజుకు రెండు మూడు వందలు సంపాదిస్తూ ఉంది.

తాను సివిల్స్ రాయాలని గట్టి నిర్ణయంతో ఉంది.  ఆమెలో సివిల్స్ పాసయి ఐఎఎస్ ఉద్యోగానికి ఎంపిక కావాలన్న తపన చాలా బలీయంగా ఉందంటే, ఏ కొశాన తన  పట్టుదల సడించుకునే లాగా లేదు.

దృఢ నిశ్చయంతో లక్ష్యం చేరుకునేందుకు తగిన శక్తి సామర్థ్యాలు తనదగ్గర చాలా ఉన్నాయని నమ్ముతూ ఉంది. ఎందుకు ఐఎఎస్ సాధించాలనుకుంటున్నదో కూడా ఆమెకు స్పష్టమయిన అభిప్రాయం ఏర్పడింది. ఐఎఎస్ కు ఎంపికయితే, ఉత్యతున్నత ఉద్యోగాల్లో ఉండవచ్చు. సమాజానికి మేలు చేసేందుకు తగిన వనరులు ఆ హోదాలో అందుబాటులో ఉంటాయి. నేను సొసైటీ కొంతయినా మార్చాలనుకుంటున్నారు. పేదలకు సేవచేయాలనుకుంటున్నాను. దీనికి ఐఎఎస్ పరీక్ష పాసవడం ఒక మార్గమని విశ్వసిస్తున్నానని ఆమె చెప్పారు.  ఆమె అజేయురాలు కావాలని, ఆ ఉన్నతాశయం నెరవేరాలని కోరుకుందాం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0