Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Chief Minister YS Jaganmohan Reddy held a review meeting on the performance of AP Education Department

 ఎపి విద్యాశాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు సమీక్షా సమావేశం

Chief Minister YS Jaganmohan Reddy held a review meeting on the performance of AP Education Department

ఎపి విద్యాశాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యార

  • పాఠశాల విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష 
  • నాడు నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించిన అధికారులు . 
  • వాటికి సంబంధించిన వివరాలును సీఎంకు అందించిన అధికారులు . 
  • స్కూళ్లలో కల్పించిన సౌకర్యాల్లో ఎదురైన సమస్యలను గుర్తించామని , వాటికి సంబంధించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు . తెలిపిన అధికారులు .

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే . 

  • నాడు - నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్ చేయాలని సీఎం ఆదేశం . 
  • ప్రతి నెలకు ఒకసారి ఆడిట్ చేయాలన్న సీఎం 
  • స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా ? లేదా ? అన్నది పరిశీలన చేయాలి.
  • అవసరమైన చోట వెంటనే పనులు , మరమ్మతులు చేయించాలి.
  • స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలి .
  • ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్ను స్కూళ్లలో ప్రదర్శించాలన్న సీఎం . 
  • ఈ నంబర్కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలన్న సీఎం . 
  • 14417 టోల్ నంబర్ను ఏర్పాటు చేశామన్న అధికారులు .

విద్యాకానుకపైనా సీఎం సమీక్ష . 

  • వచ్చే ఏడాది జూన్లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్నిరకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధంచేసుకున్నామన్న అధికారులు .  
  • స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలన్న సీఎం .
  • యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్న సీఎం . 
  • స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలని సీఎం ఆదేశం 
  • స్కూళ్ల అభివృద్ధి , నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలన్న సీఎం .
  • గ్రామంలో పారిశుద్ధ్యం , తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం . 
  • వీటిపై ఎప్పకప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలన్న సీఎం . 
  • నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం . 
  • దీంతో పారిశుద్ధ్య లోపం . వల్ల , నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందన్న సీఎం . 
  • సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు స్కూళ్ల నిర్వహణలో భాగస్వామ్యం కానున్న సచివాలయ ఉద్యోగులు .
  • ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ , మహిళా పోలీసు సందర్శన .
  • నెలకోసారి ఏఎన్ఎం సందర్శన .  
  • ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్ఓపీ తయారు చేశామన్న అధికారులు . 
  • స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్లతో సహా అప్లోడ్ చేయనున్న ముగ్గురు సచివాలయ సిబ్బంది . 
  • వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోనున్న అధికారులు . - మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో ( ఎంఈఓ ) ఒకరికి అకడమిక్ వ్యవహారాలు , మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలన్న సీఎం . 
  • టీచర్లకు , 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని సమీక్షించిన సీఎం . 
  • 5,18,740 ట్యాబ్లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం . 
  • ట్యాబ్లో బైజూస్ కంటెంట్ తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలను , ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం . 
  • ఈ కార్యక్రమంపైనా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి .  
  • దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనావేసిన అధికారులు . 
  • దశలవారీగా వీటిని తరగతి గదుల్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం . 
  • దాదాపు రూ . 512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా . 
  • వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్ జరగేలా చూడాలన్న సీఎం . 
  • అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు . - డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం , ఆర్బీకేలు , విలేజ్ క్లినిక్స్ అన్నింట్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం . 

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , సీఎస్ సమీర్ శర్మ , పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ , పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ , స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్ , ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు , పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Chief Minister YS Jaganmohan Reddy held a review meeting on the performance of AP Education Department"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0