Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Computer Keyboard

 Computer Keyboard : కంప్యూటర్ కీ బోర్డుపైన ABCD లు వరుస క్రమంలో ఎందుకు ఉండవు .వివరణ.

Computer Keyboard

Computer Keyboard: ఈ రోజుల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమే. కంప్యూటర్‌ లేనిది వివిధ రకాల పనులు జరగని పరిస్థితి. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది కంప్యూటర్‌ వాడకం ఎక్కువైపోతోంది.

అయితే కంప్యూటర్‌ ఆపరేటింగ్‌లో ముఖ్యమైనది కీ బోర్డు. ఇది లేనిది కంప్యూటర్‌లో ఏ పని జరగదు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. పెన్ను పట్టి పేపర్‌పై రాయాల్సిన కాలం పోయింది. ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయాలన్నా ముందుగా కంప్యూటర్‌ వచ్చి ఉండాలి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో కంప్యూటర్ లేనిదే పనులు జరగవు. అయితే కంప్యూటర్ వాడాలంటే కీ బోర్డు తప్పనిసరి. కానీ మనం ప్రతి రోజు కీబోర్డుపై ఎంతో వర్క్ చేస్తుంటాము. కానీ ఒక విషయం గమనించి ఉండము. అందేంటంటే మనం సాధారణంగా వాడే కీబోర్డును క్వర్టీ కీబోర్డు అంటాము. కీబోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా ఏ ఓ చోటు ఉంటే బీ మరో చోట ఉంటుంది. ఇలా కీబోర్డులోని కీస్ అన్ని కూడా గందరగోళంగా ఉంటాయి. ఇలా ఎందుకున్నాయని మీరెప్పుడైనా గమనించారా..? ఇలాంటివి ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోరు. అలా ABCDలు వరుస సంఖ్యలో కాకుండా గందరగోళంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది.

అసలు కారణం ఇదే.

కీ బోర్డు పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q, W, E, R, T, Y, U, I, O, P అనే లేటర్స్‌ ఉంటాయి. వాటిని కలిపేసి పలుకుతారు. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌ షోల్స్‌ అనే వ్యక్తి రూపకల్పన చేశారట. అంతకు ముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డు పై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారట. ఇంగ్లిష్‌ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువసార్లు, కొన్నయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకు Q, Z W, X, వంటి లెటర్స్‌ వాడకం తక్కువగా ఉంటుంది. ఈ అక్షరాలు పెద్దగా వాడము. కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతుంటాము. ఇక అచ్చులయిన A,E,I,O,U లతో పాటు, P, B, L, M, N, K, L వంటివి ఎక్కువ సార్లు ఉపయోగిస్తుంటాము. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్‌ తాను రూపొందించిన టైపు మిషన్‌ కీబోర్డును 'Qwerty' నమూనాలో చేశాడట.

చేతి వేళ్లకు అనుగుణంగా.

మనం సాధారణంగా ఈ అక్షరాలనే వాడుతుంటాము. పైనున్న అక్షరాలు తక్కువ ఉపయోగపడుతుంటాయి. అదే ఒరవడి కంప్యూటర్‌ కీ బోర్డులకూ విస్తరించింది. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం.. మరింత సులువైన 'కీ బోర్డు' అమరికలున్నట్లు రుజువు చేశారు. ఇలా ఎక్కువగా ఉపయోగించే కీస్‌ను బట్టి చేతివేళ్లకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేశారు. ఈ కారణాలచేతనే కీ బోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా తయారు చేయడానికి గల కారణమని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Computer Keyboard "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0