Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CPS Protest

 CPS Protest : సీపీఎస్ ఉద్యమంపై ఉక్కుపాదం నిజమేనా  ? ఉద్యోగులు ఏం చేయబోతున్నారు .

CPS Protest


CPS Protest: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల (AP Government vs Employees) వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.

కానీ ప్రభుత్వం మాత్రం.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను అర్ధం చేసుకోవాలంటూ ఉద్యోగులను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు ఈ వివాదానికి కారణం ఏంటంటే..? తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ ను రద్దు చేస్తామంటూ అప్పటి ప్రతిపక్షనేత.. ఇప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహనరెడ్డి తన పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆయన ఏ ఉద్దేశంతో హామీ ఇచ్చారో కాని.. ఆ హామీ నెరవేర్చడం సాధ్యం కాదన్నది ఇప్పుడు ప్రభుత్వ పెద్దల మాట..
అందుకే ఇప్పుడు.. ఉద్యోగులకు మరింత మేలు చేసే విధంగా జీ.పి.ఎస్ అంటూ కొత్త విధానం తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేదన్న విషయం ఉద్యోగులు అర్థం చేసుకోవాలని.. పదే పదే కోరుతున్నారు. ఉద్యోగులతో చర్చలకు కమిటీలు కూడా వేశారు. కానీ ఆ చర్చలు ఫెయిలవ్వడంతో.. మరోసారి ఉద్యోగులు భారీగా సీఎం ఇంటి ముట్టడికి పిలుపు ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపీ.. కేసులు పెట్టడంతో.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు ఉద్యోగులు.
గతంలో ఛలో విజయవాడలా.. ఈ కార్యక్రమం కూడా సక్సెస్ అయితే.. అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం భయపడుతోందనే అభిప్రాయం ఉంది. అందుకే ఒకానొక దశలో ఉద్యోగ సంఘాల ఆందోళనలను అణచివేయటానికి కూడా వెనకాడలేదు. ఆ ప్రయత్నంలో విఫలం అయ్యారనే గత డి.జి.పి గౌతం సవాంగ్ ను తొలగించారనే ప్రచారమూ ఉంది. పోలీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగులలో భాగమే అని కాకపోతే తమకు ఎలాగూ ఆందోళన చేసే అవకాశంలేదు కనుక తమకోసం పోరాడుతున్న ఇతర ఉద్యోగ సంఘాలకు తమవంతుగా పరోక్ష మద్దతు తెలిపారన్నది బహిరంగ రహస్యమే..
ఒకానొక దశలో ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలూ జరిగాయనే విమర్శలూ లేకపోలేదు. ఏది ఏమైనా మాటతప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతుంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేవనీ.. ఉద్యోగులు పరిస్థితులనీ అర్ధం చేసుకోవాలని మంత్రులు అంటున్నారు.
ఆర్థిక పరిస్థితి బాగులేదన్న విషయం సీఎం జగన్ కు తెలిసి కూడా ఎలా హామీ ఇచ్చారని.. ఈ విషయాన్ని సీఎం అయిన వెంటనే కూడా ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగులేకుంటే.. ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారు. పలు సందర్భాల్లో అడకుండానే అందరికీ కోట్లు కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ తో సంబంధం ఉన్నవారందరినీ.. ప్రభుత్వం దోషుల్లా ట్రీట్ చేస్తోందని.. ఎలాంటి సంబంధం లేకుండా నోటీసులు జారీ చేస్తోందని.. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. పోలీసులతో తమ ఉద్యమాన్ని అణచివేయలేరని.. కచ్చితంగా మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామంటున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CPS Protest"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0