Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Daughter's day

సెప్టెంబర్ 4వ ఆదివారం.డాటర్స్ డే. కూతుళ్ళ దినోత్సవం.

Daughter's day

భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ ఆదివారం రోజున కుమార్తె ల దినోత్సవాన్ని  జరుపుకొనే సంప్రదాయం ఉంది.  పుత్రికల దినోత్సవాన్ని కొన్ని దేశాల్లో సెప్టెంబర్ 25న, మరికొన్ని దేశాలలో అక్టోబర్ 1న జరుపుకుంటారు.

ఆడపిల్లల గౌరవం, సమానత్వం కోసం అమెరికా, యూకే, కెనడా, జర్మనీ వంటి దేశాల్లో కూతుల్ల దినోత్సవం జరుపుకుంటున్నారు.

డోటర్స్ డే ఎందుకు జరుపుకుంటారు ?

గతంలో ఆడపిల్ల పుట్టడాన్ని అపోహలతో ముడిపడే సంప్రదాయం ఉండేది.  బాలుడు పుడితే, ఆయనకు సాదరస్వాగతం లభించేది.

 ప్రస్తుతం కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో నేటికీ కుమార్తెలను నిర్లక్ష్యం చేస్తున్నారు.వారి  పెంపకంపై సరైన దృష్టి సారించడం లేదు. ప్రగలలో ఆ భావజాలాన్ని తుడిచిపెట్టటానికి కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రవేశపెట్టబడింది.

ఫలితంగా 

కొడుకు ఒక్కడుంటే చాలు’ అనుకొనే పాతకాలం నాటి నమ్మకాలకు కాలం చెల్లిపోయింది. తల్లిదండ్రుల నమ్మకాల్లో, ఆలోచనల్లో, అనుబంధాల్లో  సమతాభావనలు వెల్లివిరుస్తు న్నాయి. ‘కొడుకైనా, కూతురైనా ఒక్కటే అనే’ భావన బలోపేతమవుతోంది. 

ఇప్పుడు  ఎంతోమంది తల్లితండ్రులు ‘ఒక్క  కూతురు చాలు’నని  సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

ఒకప్పుడు కూతురు అంటే భారం. గుండెలమీద కుంపటిగా భావించేవారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. 

ఎంతోమంది కూతుళ్లు తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తున్నారు. గొప్ప పేరు సంపాదిస్తున్నారు. తాము ఎంచుకొన్న రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు. తాము పుట్టిపెరిగిన సమాజాన్ని, దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెడుతున్నారు.

కూతురు అంటే ఉన్నతమైన విలువలకు నిలువెత్తు రూపం. కూతురు ఆర్తి కలిగిన  బంగారు తల్లి.ఆమె కన్నవారి పట్ల ఎంతో ప్రేమను ఆప్యాయతను చూపుతుంది. అచ్చం అమ్మలాగే ఆదరిస్తుంది. కంటిపాపలా పెరిగిన బిడ్డ పెద్దయ్యాక తన తల్లిదండ్రులను తన కంటికి రెప్పలా చూసుకోవాలని ఆరాటపడుతుంది.

 పేరెంటింగ్‌ దృక్పథంలో మార్పు వచ్చినట్లుగానే పిల్లల ఆలోచనల లోనూ మార్పు వస్తోంది. ఎంతో మంది కూతుళ్లు  ‘ది బెస్ట్‌ డాటర్‌’గా పేరు తెచ్చుకుంటు న్నారు. అమ్మానాన్నల కలలను సాకారం చేయడంలో ముందువరసలో ఉంటున్నారు.  సింధూలై, మిథాలీ, సానియా, సైనా  వంటివారు విజయబావుటాలు ఎగరవేస్తున్నారు. ఎవరెస్టు శిఖాన్ని అధిరోహించిన మాలావత్‌ పూర్ణ ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఉత్తేజభరితం.

కుమారులతో సమానంగా కూతుళ్లను తల్లిదండ్రులు ప్రోత్సహించడంవల్ల ఒక కల్పనా చావ్లా నింగిలోకి దూసుకెళ్లింది. పి.టి.ఉష పరుగులరాణి అయింది. మలాలా అతి పిన్నవయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందింది, తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగి దేశానికి ఇందిరాగాంధీ మన దేశ ప్రధానమంత్రి అయ్యారు. బాడ్మింటన్, టెన్నిస్ క్రీడాకారిణిలు పి.వి.సింధు, సానియా మీర్జా సాధించిన విజయాలు అందరికీ తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి, ఝల్కరీబాయి వంటి వీరవనితల గాథలను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే కూతుళ్ళ దినోత్సవానికి సార్థకత.

 ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో ఓ మహాలక్ష్మి పుట్టినట్లే అని అంటారు పెద్దలు. ఇంట్లో అబ్బాయిలు ఎంతమంది వున్నా ఒక్క ఆడపిల్ల ఉందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆడపిల్ల లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది. ఇంట్లోవారికి ఎవరెవరికి ఏమీ ఇష్టమో బాగా తెలిసేదేది తల్లి తర్వాత కూతురికే. తల్లిదండ్రులను ప్రేమించడంలో కూతుళ్ళను మించినవారు ఇంకొకరు ఉండరు. తనకు పెళ్ళై వేరే ఇంటికి వెళ్లిపోయినాసరే తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోదు. అందుకే కూతురి ప్రేమ జీవితాంతం అంటారు పెద్దలు. స్నేహితురాలిగా, అమ్మగా అన్ని విషయాల్లోనూ తోడుగా నిలిచి సాయం చేస్తుంది కూతురు. అందుకే నేటి ఆధునిక కాలంలో తల్లిదండ్రులు కూడా కొడుకులతోపాటు కూతుళ్లను సమాన దృష్టితో చూసుకుంటున్నారు. 

ఆడ, మగ తారతమ్యం లేకుండా ఉండటానికే రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టిననాటినుంచే పెళ్లి అయ్యేవరకు బాధ్యత ప్రభుత్వనిదే అంటూ కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టాయి. అందుకే ఆడపిల్లలు పుట్టినా బాధపడే రోజులు పోయాయి.

లింగ అసమానతలు

నేడు అందరినీ ఆవేదనకు గురిచేస్తున్న సమస్య రోజురోజుకూ పడిపోతున్న స్ర్తి, పురుష నిష్పత్తి. ఈనాడు దేశ వ్యాప్తంగా 1000 మంది బాలలు వుంటే 933మంది బాలికలు ఉన్నారని. దీనినిబట్టి చూస్తే ఆడపిల్లల జనన శాతం ఎంతగా పడిపోతోందో అర్థమవుతోంది.

ఆడపిల్లలపట్ల అభద్రతా భావంపోయి ఆడపిల్ల పుట్టిందంటూ ఆనందపడే రోజులు రావాలి. వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి. ఆడపిల్లలకు వృత్తి, విద్యా, శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక విద్యకు అధిక నిధులు కేటాయించాలి. ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు కేవలం నూటికి 10 నుండి 30 శాతం మాత్రమేవుంది. 

బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిని బతికించు.. అమ్మాయిని చదివించు) నినాదంతో ఆడపిల్ల భవిష్యత్తుకు పునాదివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి పథకం’ ప్రవేశపెట్టింది. 10 ఏళ్ళలోపు అమ్మాయిల పేరిట సుకన్య సమృద్ధి ఖాతాను తపాలా శాఖలో తెరిచే అవకాశం కల్పించింది. చదువు, వివాహం దృష్టిలో పెట్టుకుని ఈ పథకం అమలు చేస్తోంది. 

పసిపిల్లలపై  పైశాచిక దాడులును అణచివేయాలి. ఆడపిల్లలకు భద్రతాభావం కల్పించాలి, బాల్య వివాహాలను అరికట్టాలి. ‘కంటే కూతుర్నే కనాలి’ అనే భావన కలగాలి. అప్పుడే కూతుళ్ళ దినోత్సవానికి సార్థకత.

కూతుళ్లను కన్న తల్లిదండ్రులందరికీ డాటర్స్ డే శుభాకాంక్షలు


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Daughter's day"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0