Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Employees demand cancellation of CPS

CPS రద్దుకే ఉద్యోగుల పట్టు

Employees demand cancellation of CPS

  • కుదరదన్న ప్రభుత్వం జీపీఎస్ కోసమే బెట్టు
  • కుదరని ఏకాభిప్రాయం చర్చలు విఫలం
  • మరోసారి ఆలోచించాలన్న మంత్రుల కమిటీ
  • ఆ మాటే వద్దన్న సంఘాలు
  • ప్రయోజనాల పరిరక్షణకు సిద్ధం
  • తాజా ప్రతిపాదనలతో నచ్చచెప్పే యత్నం

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని గత కొన్ని నెలలుగా ఉద్యోగులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించింది. గతంలో సచివాలయంలో జరిగిన చర్చల్లో ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టబట్టగా సాధ్యం కాదని, ఉద్యోగులకు భద్రతగా ఉండే విధంగా జీపీఎస్ ను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే మరోమారు బుధవా రం కేబినెట్ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ ఆమోదయోగ్యం కాదని గతంలోనే తెలిపామని ఉద్యోగ సంఘాలు పునర్ఘాటించాయి. అయితే సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది. కొత్త విధా నంలో ఉద్యోగులకు మరింత భద్రత కల్పించేందుకు తాజాగా కొన్ని ప్రతిపాద నలు చేసింది. జీపీఎస్ విధానంలో ఉద్యోగికి కనీస పింఛన్ రూ.10 వేలు ఇస్తామన్నారు. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే ఉద్యోగి జీతాన్ని బట్టి బీమా పరిహారంతో పాటు స్పౌజు కూడా పింఛన్ భద్రత ఇస్తామన్నారు. రూ.20 వేల లోపు బేసిక్ పే ఉన్న వారి కి రూ. 40 లక్షల ప్రమాద బీమా అందిస్తామన్నారు. పదవీ విరమణ తర్వాత 33 శాతం గ్యారెంటీ పింఛన్ ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు ప్రేమ ఉందని సీపీఎస్ కంటే మెరుగ్గా ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని మంత్రుల కమిటీ పేర్కొంది. ఓపీఎస్ వల్ల భవిష్యత్లో ప్రభుత్వం పైపెను ఆర్థిక భారం పడుతుందని, దీన్ని ఉద్యో గులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎన్నికల కు ముందు సీపీఎస్ రద్దుపై జగన్ ఇచ్చిన హామీ ను నిలబెట్టుకోవాలనే ప్రభుత్వం ప్రయత్ని స్తుందని అయితే భవిష్యత్లో ప్రభుత్వంపై పడే దృష్టిలో పెట్టుకుని ఓపీఎస్ కు ఆర్ధిక భారాన్ని దగ్గరగా మెరుగైన రీతిలో జీపీఎస్ ను తీసుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఝార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాలలో సీపీఎస్ రద్దు చేశారని ఉద్యోగ సంఘాలకు సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. అలాగే ఇటీవల ఉద్యోగ సంఘాలు, ఉద్యోగు లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరగా సాను కూలంగా మంత్రుల కమిటీ స్పందించింది. సచివాలయంలో సాయత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు చర్చలు జరిగా యి. కాగా సమావేశానికి ఏపీ అమరావతి జేఏసీ, ఏపీసీపీ ఎస్ ఉద్యోగుల సంఘం, ఏపీసీపీఎస్ ఎంప్లా యిస్ అసోసియేషన్ హాజరుకాలేదు. చర్చల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరఫున ఏపీ ఎన్జీవో అసోసి యేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీజీ ఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, సచివాల య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంక ట్రావు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీని వాస్, ఏపీ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, గుల్జార్, హెచ్. అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దుఅసాధ్యం: బొత్స

సమావేశానికి ముందు, తర్వాత బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. సీపీఎస్పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం హామీ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. అధికారంలో వచ్చాక పరిశీలిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదుఅని తేలిందన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వాన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులున్నాయన్నారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ప్రభు త్వం జీపీఎస్ ను తీసుకొచ్చిందన్నారు. జీపీఎస్పై పలు దఫాలుగా ఉద్యో గులపై చర్చించి ఫైనల్ డ్రాఫ్న వివరించామన్నారు. పదవీ విర మణ చేసిన తర్వాత ఉద్యోగులకు భద్రతగా కనీసం రూ. 10 వేల పెన్షన్ గ్యారెంటీ ఉండేలా మార్పు చేశామన్నారు. పెన్షనర్ చనిపోతే భర్యా లేదా భర్తకు పెన్షన్ ఇస్తామన్నారు. పెన్షనర్లకు హెల్త్ కార్డులు కొనసాగిస్తా మన్నారు. ప్రమాదవశాత్తు చని పోతే ఎక్స్రేషియా ఇచ్చేలా చర్యలు తీసుకుం టామన్నారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. జీపీఎస్ ఫైనల్ అయ్యాక చట్టభద్రత కల్పిస్తామన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేతపై గురువారం సీఎంతో చర్చిస్తామన్నారు. ఇదిలా ఉండగా సీఎం సతీమణి భారతి గురించి మాట్లాడేటప్పుడు తెదేపా నేతలకు బుద్ధి ఉండాలని మండి పడ్డారు. చంద్రబాబు ఏదైనా ఉంటే రాజకీ యంగా పోరాడాలే కానీ ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడటం నీచమైన చర్య అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని కామెంట్ చేశారని ఎంత హంగామా చేశారో తెలిసిందేన న్నారు. ఈ విషయాన్ని కేబినెట్లో మాట్లా డటం జరిగిందన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Employees demand cancellation of CPS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0