Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Financial Planning

 Financial Planning: భ‌విష్య‌త్‌ ఆర్థిక అవ‌స‌రాల కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Financial Planning

భ‌విష్య‌త్‌ కోసం ఆర్థికప‌ర‌మైన విష‌యాల్లో సంపాదన మొదలు నుంచే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉండ‌డం చాలా అవ‌స‌రం. భ‌విష్య‌త్‌ ఖ‌ర్చుల కోసం సిద్ధంగా ఉండడం వ‌ల్ల వారి ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను వేగంగా ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలైన ఇల్లు కొనుగోలు, ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి, పిల్లల చదువు/పెళ్లి లాంటి ల‌క్ష్యాల‌పై దృష్టి పెట్టడం మంచిది. ఇక్కడే కొందరు ఆర్థిక ప్ర‌ణాళిక‌కు సంబంధించి కొన్ని సాధార‌ణ త‌ప్పులు చేస్తుంటారు. వాటిని ఎలా స‌రిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం..

అత్య‌వ‌స‌ర నిధి విషయంలో నిర్లక్ష్యం వద్దు.

అత్య‌వ‌స‌ర ఆర్థిక ప‌రిస్థితులను ఎదుర్కోవ‌డానికి క‌నీసం 3-6 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని తక్కువ రిస్క్, అధిక లిక్విడిటీ ఉన్న పథకంలో పెట్టుబడి పెట్టడం మంచిది. బ్యాంకుల్లో త‌క్కువ కాల వ్య‌వ‌ధి ఉన్న డిపాజిట్ల‌లో గానీ, పొదుపు ఖాతాలో గానీ, లిక్విడ్ ఫండ్స్‌లో గానీ మ‌దుపు చేయొచ్చు. త‌ద్వారా మీరు అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో సుల‌భంగా ఉపయోగించుకోవచ్చు.

త‌గిన జీవిత బీమా క‌వ‌రేజీ క‌లిగి ఉండాలి

జీవిత బీమా అంటే నిర్దిష్ట వ్య‌వ‌ధి త‌ర్వాత ల‌భించే న‌గ‌దు కాదు.. సంపాదించే వ్య‌క్తిపై ఆధార‌ప‌డ్డ వారికి ఆర్థిక భ‌ద్ర‌త‌ను అందించేది. ఏ ఆర్థిక లోటూ లేకుండా అత‌డి త‌ద‌నంత‌రం కుటుంబాన్ని కాపాడేది. ఇటువంటి జీవిత బీమా ట‌ర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో త‌గినంత మొత్తంలో.. అంటే ఆ వ్య‌క్తి వార్షిక ఆదాయానికి 12-15 రెట్లు ఉండాలి.

ఆరోగ్య బీమా కూడా.

అనారోగ్య స‌మ‌స్య‌లు కుటుంబంలో ఎవ‌రికైనా రావ‌చ్చు. దీనివ‌ల్ల ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు అప్ప‌టిదాకా దాచుకున్నదంతా క‌రిగిపోయే ప్ర‌మాదం ఉంది. ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన ప‌రిస్థితులు రావ‌చ్చు. అప్పులు చేయ‌డం కూడా త‌ప్ప‌దు. ఇలాంటి ప‌రిస్థితులు నివారించాలంటే కుటుంబ స‌భ్యులు ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ముందుచూపుతో ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవాలి. ఈ బీమాకు త‌గిన‌ రైడర్లు జ‌త చేసుకోవాలి.

పొదుపు మొదలు ఇప్పుడే.

సంపాదిస్తున్న ప్రారంభంలోనే మ‌దుపు అల‌వ‌ర్చుకోవాలి. మ‌దుపును వాయిదా వేయ‌డం అంత మంచిది కాదు. దీర్ఘ‌కాలం పొదుపు చేయాలి. వెంట వెంట‌నే అధిక రాబ‌డి ఫ‌లితాల‌ను ఆశించ‌కూడ‌దు. ఆర్థిక ప్ర‌ణాళిక‌లో పొదుపు ప్రారంభించ‌డానికి సరైన స‌మ‌యం కోసం వేచి ఉండకూడదు. వెంట‌నే మొద‌లుపెట్టాలి. 

సంప్ర‌దాయ పెట్టుబ‌డుల మీద‌నే ఆధార‌ప‌డ‌కూడ‌దు

బ్యాంకు ఎఫ్‌డీలు, పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపులు, జీవిత బీమాలోని యూనిట్ లింక్డ్ పాల‌సీలు వంటి సంప్రదాయ పొదుపు సాధ‌నాల‌కు మించి ఆలోచించాలి. మ‌న నిక‌ర రాబ‌డి (ఆదాయ ప‌న్ను అనంత‌రం) ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి ఉండాలి. కనీసం 10 ఏళ్ల పాటు మ్యూచువ‌ల్ ఫండ్లలో సిప్ (SIP) చేయవచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ గ‌త 10 సంవ‌త్స‌రాల‌ పాటు SIP చేసిన వారికి 26.28% సగటు వార్షిక రాబ‌డి అందించింది. ఇది ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. మ్యూచువల్ ఫండ్ రాబ‌డులు గ‌తంలోలా ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కొంత వరకు రిస్క్ తగ్గించుకోవాలంటే ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.

మొహ‌మాటాల‌కు పోవ‌ద్దు

పెట్టుబడితో కూడిన సంప్రదాయ బీమా పాలసీలను కొంత మంది బీమా కంపెనీ ఏజెంట్లు సరైన సమాచారం లేకుండా వినియోగదారులకు అంటకట్టేస్తుంటారు. ఇటువంటి కొనుగోళ్ల‌ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. జీవిత బీమా అనేది పెట్టుబ‌డి కాదు. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. అందుచేత ఆన్‌లైన్‌లో ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవ‌డం ఉత్త‌మం. భావోద్వేగ కార‌ణాల‌తో లేక స్నేహితులు/బంధువుల ద్వారా బీమా పాల‌సీలు కొనుగోలు చేసేట‌ప్పుడు భ‌విష్య‌త్‌లో అవి ఎంత‌వ‌ర‌కు మీకు, మీ కుటుంబానికి అవ‌స‌ర‌మ‌వుతాయో ఆలోచించుకోవాలి. కొనుగోలుకు తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు. మొహ‌మాటాల‌కు పోకూడ‌దు.

ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం

ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత జీవితాన్ని ఆషామాషీగా తీసుకోవ‌ద్దు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సాధార‌ణ ఖ‌ర్చులే కాకుండా వైద్య సంర‌క్ష‌ణ ఖ‌ర్చులు, విశ్రాంతి ఖ‌ర్చులను త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణించాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ అనంతర జీవితానికి సరిపడా నిధిని సమకూర్చుకోవాలి. ఈ నిధి మీకు నెల నెలా పెన్షన్ అందించే విధంగా ఉండాలి. చిన్న వ‌య‌సు నుంచే ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి పీఎఫ్‌తో పాటు ఎన్‌పీఎస్‌లో కూడా మదుపు చేయడం మంచిది.

ఆర్థిక న‌మ్మ‌కాన్ని కోల్పోకూడ‌దు

రుణ బ‌కాయిల‌ను స‌రైన స‌మ‌యంలో తీర్చేయాలి. క్రెడిట్ స్కోరు అన్నివేళలా 750 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. ఎవ‌రికైనా ఏ స‌మ‌యంలో డ‌బ్బు అవ‌స‌రం ప‌డుతుందో తెలియ‌దు. ఒక్కోసారి రుణాలు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అవుతుంది. రుణాల విష‌యంలో మంచి న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా చూపించేది ఈ క్రెడిట్ స్కోరే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Financial Planning"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0