Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home Remedies For Lice

Home Remedies For Lice : తలలో పేన్లతో విసిగిపోయారా ? ఒక్కరోజులో ఇవి పోయే సింపుల్ టెక్నిక్ .

Home Remedies For Lice

 లలో పేలు.. ఈ సమస్య ఎదుర్కోని వారు ఎవరూ ఉండరేమో.. ఈ మాట వినగానే.. మనలో చాలామందికి తల మీద చిటచిట పెట్టినట్లు అనిపిస్తుంది. వెంటనే మన చేతి వేళ్లు జుట్టులోకి వెళ్లిపోతాయి.

ముఖ్యంగా బాల్యంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తాయి. పేల్లను తొలగించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఉంటాం. కొన్నిసార్లు మార్కెట్‌లో లభించే అన్ని రకాల ఉత్పత్తులను కూడా ఉపయోగించి ఉంటాం. కానీ కొన్నిసార్లు అవి కూడా పెద్దగా పని చేయవు. ఈ పేలు మరీ ఎక్కువగా ఉంటే.. జుట్టు పీకేస్తే బాగుండన్నంత చిరాకు పుట్టుకొస్తుంటుంది. ఇంతగా ఇబ్బంది పెట్టే పేల్లను ఎలా వదిలించుకోవాలి..? కాబట్టి అటువంటి కొన్ని హోం రెమెడీలను ఇప్పుడు తెలుసుకుందాం..

నూనెతో పేను వదిలించుకోగలరు.

నూనె మన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అవి చర్మం రకం, పరిస్థితికి అనుగుణంగా ఉపయోగించబడతాయి. జుట్టు సమస్యలను తగ్గించడానికి ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో టీ ట్రీ ఆయిల్ నుంచి పెప్పర్‌మింట్ ఆయిల్ వరకు ఎంచుకోవచ్చు.

పేలు సమస్య నుంచి బయటపడటానికి.. ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల ఆలివ్ నూనె, 15-20 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి, దానిని కలపండి. దీని తర్వాత, కాటన్ బాల్‌తో తలకు పట్టించాలి. నూనెను అప్లై చేసిన తర్వాత.. రాత్రిపూట లేదా కనీసం 12 గంటలు అలానే వదిలివేయండి. దీని తర్వాత, మరుసటి రోజు ఉదయం జుట్టును దువ్వి, ఆపై షాంపూతో కడిగి ఆరబెట్టండి. ఈ రెమెడీని వారానికి మూడుసార్లు చేయడం వల్ల పేలతో పాటు వాటి గుడ్లు కూడా పోతాయి.

ఉప్పు కూడా అద్భుతంగా పని చేస్తుంది..

వంటగదిలో ఉండే ఉప్పుతో కూడా మనం పేను సమస్యకు చెక్ పెట్టవచ్చు.. దీని కోసం, నాలుగు కప్పు ఉప్పులో 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి పేస్ట్ సిద్ధం చేయండి. తర్వాత ఆ పేస్ట్‌ను జుట్టుకు పట్టించండి. షవర్ క్యాప్ లేదా ఏదైనా ప్లాస్టిక్ ఫాయిల్‌తో జుట్టును కప్పి ఉంచండి. 2 గంటల తర్వాత జుట్టును దువ్వి, తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పేను సమస్యలు తొలగిపోతుంది.

ఇలా అస్సలు చేయకండి

పేలు సమస్యను నివారించడానికి.. జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ వేసుకోవడం కానీ.. నూనె రాయడం కాని చేయవద్దు. దీనితో పాటు, తడి జుట్టుకు నూనె రాయడం వల్ల పేను మరింతగా పెరుగుతాయి. ఇది కాకుండా, పేలు ఇతర వ్యక్తుల నుంచి కూడా రావచ్చు.. ఇతరులు ఉపయోగించిన దువ్వెనలతో దువ్వకండి. అలాగే, జుట్టులో పేలు ఉన్న వ్యక్తితో నిద్రించవద్దు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Home Remedies For Lice"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0