Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Hon'ble Education Minister's comments regarding the meeting of the Cabinet Sub-Committee with the Trade Unions.

 ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ గురించి గౌరవ విద్యాశాఖ మంత్రి గారి వ్యాఖ్యలు.

Hon'ble Education Minister's comments regarding the meeting of the Cabinet Sub-Committee with the Trade Unions.
ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్​పై ఇప్పటివరకు తమతో వారి ఇంట్లో జరిగిన భేటీలు అనధికారికమేనని ఆ మంత్రి బొత్స అన్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉందని.ఉద్యోగ సంఘాలు రాకపోతే సీపీఎస్​ను అంగీకరిస్తున్నట్లు భావిస్తామన్నారు.

Minister Botsa on CPS: ఏపీలో సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర సీఎం హామీ ఇచ్చారని మంత్రి బొత్స అన్నారు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉందని... భేటీలో జీపీఎస్ అమలుపై మరిన్ని అంశాలు చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఇప్పటివరకు జరిగిన భేటీలన్నీ అనధికారికమేనని పేర్కొన్నారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిగే సమావేశమే అధికారికమైందని స్పష్టం చేశారు. భేటీకి రావాలని అన్ని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించామన్నారు. భేటీకి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఆశిస్తున్నాం.. భేటీకి రాకపోతే సీపీఎస్ బాగుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు అనుకుంటామన్నారు. భేటీని ఉద్యోగ సంఘాలు బహిష్కరిస్తే ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

"సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలింది. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. సీపీఎస్ కంటే మెరుగ్గా ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చింది. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. భేటీలో జీపీఎస్ అమలుపై మరిన్ని అంశాలు చర్చిస్తాం. ఇప్పటివరకు నాతో మా ఇంట్లో జరిగిన భేటీలు అనధికారికమే. ఇవాళ ఉద్యోగ సంఘాలతో సమావేశమే అధికారికమైంది. భేటీకి రావాలని అన్ని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించాం. భేటీకి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఆశిస్తున్నాం. భేటీకి రాకపోతే సీపీఎస్ బాగుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు అనుకుంటాం. భేటీని ఉద్యోగ సంఘాలు బహిష్కరిస్తే ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తాం" -మంత్రి బొత్స సత్యనారాయణ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Hon'ble Education Minister's comments regarding the meeting of the Cabinet Sub-Committee with the Trade Unions."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0