How to drink water
ఒక రోజుకు నీళ్ళు ఎన్ని త్రాగాలి? ఎలా త్రాగాలి ? ఎందుకు అలా త్రాగాలి ? ఎప్పుడెప్పుడు తాగితే మంచిది .ఎక్కువ మోతాదులో త్రాగితే చాలా ప్రమాదమట.
"భోజనాంతే విషం వారీ" అంటారు దీని అర్ధం భోజనం చేసిన వెంటనే నీరు త్రాగటం "విషం"తో సమానం. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ జఠరాగ్ని ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇదే ముఖ్యం.
తిన్న తరువాత నీళ్ళు త్రాగితే జఠరాగ్నిచల్ల బడిపోతుంది. దాంతో తిన్న ఆహారం అరగక కుళ్ళి పోతుంది. ఆ విష వాయువుల వలన 103 రకాల రోగాలు వస్తాయి.
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి.
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంటన్నర తరువాత త్రాగాలి.
భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును. భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి 2 గుటకల నీరు త్రాగవచ్చును.
అందుకే నీటిని వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి. గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు. నిదానంగా నీటిని త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలుస్తుంది. అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి, లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి. అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును. ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది గుర్తుపెట్టు కొండి.
మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి. ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది. దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది. మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను.
ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి. నిలబడి నీళ్ళు త్రాగరాదు. చల్లని నీళ్ళు ( Cool Water) త్రాగరాదు.
గోరు వెచ్చని నీళ్ళు త్రాగగలిగితే ఇంకా మంచిది.ఎండా కాలములో మట్టికుండలోని నీరు త్రాగవలెను . మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు. మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు .
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు. మల మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన ఎన్నో జబ్బులు వస్తాయి..
నీళ్లు అతిగా అనగా ఎక్కువ మోతాదులో త్రాగితే చాలా ప్రమాదం
ఇదిలా ఉంటే అతిగా మంచినీరు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అటు గుండె, మూత్రపిండాలు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
0 Response to "How to drink water"
Post a Comment