Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you don't come to school, you will know immediately

పాఠశాలకు డుమ్మా కొడితే దొరికిపోతారు!

If you don't come to school, you will know immediately

  • పాఠశాలల్లో యాప్ ద్వారా అటెండెన్స్
  • పిల్లలు బడికి రాకుంటేతల్లిదండ్రులకు మెసేజ్
  • వరుసగా మూడు రోజులు రాకుంటే ఇంటికే వలంటీర్
  • హాజరు శాతం పెంపునకు దోహదం
  • అమ్మ ఒడి అందరికీ అందేలా చర్యలు
  • విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి

అమ్మా.. బడికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి స్నేహితులతో కలిసి షికార్లు కొడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు. మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదుకు కృష్ణా జిల్లాలో చేసిన ప్రయోగం విజయవంతం కావటం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఆన్లైన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రుల సెల్ఫోన్కు మెసేజ్ వెళ్లేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇది సత్ఫలితాలు

హాజరుశాతం పెంచేలా.

కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో రెండేళ్ల పాటు చదువులు సవ్యంగా సాగలేదు. చదువులు సైతం అంతంత మాత్రమే సాగాయి. అందుకే విద్యార్థులం దరికీ బడికి రప్పించి, వారికి విద్యాబుద్ధులు నేర్పిం చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదుకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో హాజరు శాతం పెంచటంతో పాటు, అర్హులైన వారం దరికీ అమ్మ ఒడి పథకం అందించేలా విద్యాశాఖా దికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

 యాప్ తో ఎన్నో ప్రయోజనాలు.

చదువులకు తోడ్పాటు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు జగనన్న అమ్మ ఒడి పథకం అమలు చేస్తోంది. పాఠశాల పనిది నాల్లో తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తింపజేసేలా నిబంధనలు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి ఇది దోహదపడుతుంది. అంతేకాకుం దా మధ్యాహ్న భోజన పథకం పారదర్శకంగా అమలయ్యేలా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఉప యోగకరంగా ఉంటుంది.

యాప్ లొనే హాజరు నమోదు

ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారం భమైతే ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయా తరగతుల్లో 9.15 గంటల నుంచి 9.30 గం టల వరకు హాజరు వేసేలా జిల్లా విద్యాశాఖాధికా రులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.పాఠశాల ఉపాధ్యాయుడు తరగతికి వెళ్లిన వెంటనే సెల్ఫోన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లాగిన్ అయ్యి విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నారు.

 మూడు రోజులు రాకుంటే ఇంటికే.

మూడు రోజులు పాటు విద్యార్థి పాఠశాలకు గైర్హాజరు అయితే సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ద్వారా వలంటీర్కు సమాచారం వెళ్తుంది. దీంతో నేరుగా వారి ఇంటికి వెళ్లి బడికి రాకపోవటానికి గల కారణాలు తెలుసుకునేలా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

విద్యార్థుల బాగుకోసమే.

మొబైల్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు మం చి ఫలితాలు ఇస్తోంది. విద్యార్థుల బాగు కోసమే ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేసింది. ఉన్న తాధికారులు ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో దీని అమలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. విద్యా ర్థుల హాజరు శాతం పెరగటం వల్ల, విద్యాబోధన కూడా సవ్యంగా సాగుతుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you don't come to school, you will know immediately"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0