Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Army AOC Jobs 2022

 Indian Army AOC Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 3,068ల పోస్టులకు ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్‌ నోటిఫికేషన్‌.పూర్తి వివరాలు

Indian Army AOC Jobs 2022

కేంద్ర ప్రభుత్వ త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (HAOC) తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.3068 ట్రేడ్స్‌మెన్‌ మేట్‌, ఫైర్‌మ్యాన్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులకు (Tradesman Mate Posts) దరఖాస్తులు.

Indian Army AOC Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 3,068ల పోస్టులకు ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్‌ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..

Indian Army Aoc

Indian Army AOC Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (HAOC) తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. 3068 ట్రేడ్స్‌మెన్‌ మేట్‌, ఫైర్‌మ్యాన్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులకు (Tradesman Mate Posts) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు. ఆర్మీలో చేరి దేశ రక్షణకు సేవ చేయాలనే ఆసక్తి కలిగిన యువత ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 21, 2022వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు.

  • ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు: 2313
  • ఫైర్‌మ్యాన్ పోస్టులు: 656
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) పోస్టులు: 99

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్ https://aocrecruitment.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ మరియు మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు.. గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు ఉండాలి.

ముఖ్య సమాచారం:

అర్హతలు: ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుండి 10వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.

ఫైర్ మెన్ ఉద్యోగాలకు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుండి 10వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి 12వ ఉత్తీర్ణత లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి. మరిన్ని వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ఎంపిక ప్రక్రియ 

  • ఫిజికల్/ప్రాక్టికల్/స్కిల్ పరీక్షలు
  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా ఎంపిక

ఫిజికల్ టెస్ట్ విషయానికొస్తే

ట్రేడ్స్ మెన్ మేట్ అభ్యర్థులు.. 6 నిమిషాల్లో 1.5 కి.మీ పరుగు, 100 సెకన్లలో 50 కిలోల బరువును 200 మీటర్ల దూరం మోసుకెళ్లాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే.

అగ్నిమాపక సిబ్బంది.

శారీరకంగా దృఢంగా ఉండాలి . కఠినమైన విధులను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండాలి . దిగువ పేర్కొన్న పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. బూట్లు లేకుండా ఎత్తు - 165 సెం.మీ (ఎస్టీ సభ్యులకు 2.5 సెం.మీ.ల సడలింపు ఉంటుంది). ఛాతీ -81.5 సెం.మీ. ఛాతీ (విస్తరించిన తర్వాత) - 85 సెం.మీ. బరువు - 50 కేజీలు ఉండాలి.

అలాగే.. శారీరక దారుఢ్య పరీక్షలో.. 6 నిమిషాల్లో 1.6 కి.మీ పరుగెత్తాలి. 63.5 కిలోల బరువున్న వ్యక్తిని 96 సెకన్లలోపు 183 మీటర్ల దూరానికి మోసుకెళ్లడం.. రెండు పాదాలపై 2.5 మీటర్ల వెడల్పు కందకం దిగడం (లాంగ్ జంప్).. చేతులు మరియు కాళ్లను ఉపయోగించి 3 మీటర్ల నిలువు తాడును ఎక్కడం వంటి పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Army AOC Jobs 2022"

Post a Comment