Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PAN Card: What to do if PAN card is lost? How to get a new card? Details.

PAN Card : పాన్‌ కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలి  ? కొత్త కార్డు తీసుకోవడం ఎలా  ? వివరాలు.
PAN Card: What to do if PAN card is lost?  How to get a new card?  Details.
PAN Card: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) అనేది ఏదైనా ఆర్థిక లావాదేవీకి ఇవ్వాల్సిన తప్పనిసరి పత్రం. బ్యాంకింగ్‌, ఐటీ ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులు కావాలంటే పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే.
 ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. పాన్ (PAN) లేకుండా ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలనూ నిర్వహించేందుకు వీలు కాదు. అయితే వినియోగదారులు తప్పనిసరిగా చాలా చోట్ల పాన్ కార్డ్ (PAN Card) వివరాలను అందించాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డ్ పోయినా, దొంగిలించబడినా లేదా పాడైపోయినా.. కంగారు పాడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ ద్వారా కొత్త పాన్‌కార్డును తీసుకోవచ్చు.
రీప్రింట్ షరతులు
అయితే ఈ కొత్త సౌకర్యాన్ని NSDL e-Gov ద్వారా ఇటీవల PAN అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసిన లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ e-PAN సదుపాయాన్ని ఉపయోగించి PAN పొందిన కార్డ్ హోల్డర్‌లు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. పాన్ కార్డ్ రీప్రింట్ చేయడానికి మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు
ఈ వివరాలను నమోదు చేయండి
మీ పాన్ కార్డ్ రీప్రింట్ చేయడానికి మీరు ఇచ్చిన లింక్‌ని క్లిక్‌ చేసి అందులో కనిపించే వివరాలను పూర్తిగా ఎంటర్‌ చేయాలి. మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను నమోదు చేయాలి. కార్డ్‌ని మళ్లీ ముద్రించడానికి ఆధార్ వివరాలను ఉపయోగించడానికి దరఖాస్తుదారు సమ్మతి ఇవ్వాలి. చివరగా ఫారమ్‌ను సమర్పించడానికి మీరు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.
పాన్ కార్డ్ రీప్రింట్ కోసం ఛార్జీ
పాన్ కార్డ్ రీప్రింట్, మీ ఇంటికి డెలివరీ చేయడానికి మీరు కొంత రుసుము చెల్లించాలి. ఫారం నింపిన తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో కార్డును డెలివరీ చేయడానికి రూ.50 రుసుము చెల్లించాలి. భారతదేశం వెలుపలి చిరునామాకు కార్డును డెలివరీ చేయడానికి మీరు రూ. 959 చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లించిన తర్వాత మీ రీప్రింట్ చేసిన పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న చిరునామాకు పంపబడుతుంది. అలాగే మీరు UTIITSL వెబ్‌సైట్‌లో తాజా PAN దరఖాస్తును చేసి ఉంటే ఈ లింక్‌ని సందర్శించడం ద్వారా రీప్రింట్ అప్లికేషన్‌ను సమర్పించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PAN Card: What to do if PAN card is lost? How to get a new card? Details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0