Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRC Recruitment

 RRC Recruitment: Railway jobs in sports quota.. per month Rs. Chance to get salary more than 60 thousand.

RRC Recruitment

 RRC Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం.

RRC Recruitment 2022: ఇండియన్‌ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (RRC) వెస్టర్న్‌ రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. స్పోర్ట్స్‌ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, షూటింగ్‌, కబడ్డీ, హాకీ, జిమ్నాస్టిక్స్‌, క్రికెట్‌ వంటి విభాగాల్లో అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు.

12వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. నిబంధనల ప్రకారం సంబంధిత స్పోర్ట్స్‌లో అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

అభ్యర్థులను ట్రయల్స్‌, అసెస్‌మెంట్‌, అకడమిక్‌ మార్కులు ఇతరు నిబంధనల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 63,200 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 05-09-2022న మొదలై 04-10-2022తో ముగియనుంది.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRC Recruitment"

Post a Comment