Release Dates for NEET Counselling
నీట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను విడుదల.
దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షల్లో అర్హత సాధించి, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ కమిటీ (ఎంసీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది.
"నీట్ పీజీ ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రౌండ్ 1 కౌన్సెలింగ్ షెడ్యూల్ రిజిస్ట్రేషన్, పేమెంట్‌కు ఈ నెల 15 నుంచి 23 వరకు అవకాశం ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ సంబంధించి, ఈ నెల 20 నుంచి 25 వరకు అవకాశం ఉంటుంది. వెరిఫికేషన్ విషయానికొస్తే..ఈ నెల 23 నుంచి 24 వరకు ఉంటుంది. సీట్ అలాట్మెంట్‌కు సంబంధించి ఈ నెల 26 నుంచి 27 వరకు, ఇక ఫలితాలు విషయానికొస్తే, ఈ నెల 28న, ఇక చివరగా కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి ఈ నెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు అవకాశం ఇచ్చాం" అని మెడికల్ కౌన్సిల్ కమిటీ (ఎంసీసీ) పేర్కొంది.
ఇక, నీట్ పీజీ 2022 ప్రవేశ పరీక్ష ఫలితాల విషయానికొస్తే.. జూన్ 1వ తేదీన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. మే 21న, 849 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరుగగా, కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న దాదాపు 42,000ల పీజీ సీట్ల కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరిగింది. ఇప్పుడు పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధినీ, విద్యార్థులకు కౌన్సెలింగ్ తేదీలను ఎంసీసీ ప్రకటించింది.
0 Response to "Release Dates for NEET Counselling"
Post a Comment