The President came down the stage for the teacher
దిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దేశవ్యాప్తంగా 46 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ దివ్యాంగ ఉపాధ్యాయుడికి అవార్డు అందించేందుకు ప్రథమ పౌరురాలు వేదిక దిగి వచ్చారు. రాష్ట్రపతి చర్యతో సభా ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మార్మోగింది.
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ నేగీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించేందుకు ఆయన పేరును పిలిచారు. అయితే దివ్యాంగుడైన ప్రదీప్ నేగీని చూడగానే రాష్ట్రపతి ముర్ము స్టేజీ పైనుంచి దిగి కిందకు వచ్చారు. ఆయనను అభినందించి అవార్డును అందజేశారు. రాష్ట్రపతి గొప్ప మనసును అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించారు.ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్విటర్‌లో పంచుకున్నారు. ''రాష్ట్రపతి ముర్ము వినయ విధేయతలు, దయా గుణానికి ఈ ఘటనే నిదర్శనం.
0 Response to "The President came down the stage for the teacher"
Post a Comment