Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Uses of Pomegranate

 దానిమ్మపండు యొక్క ఉపయోగాలు

Uses of Pomegranate

క్యాన్సర్ ని తగ్గించే పండు ఏదో మీకు తెలుసా ? 

ప్రకృతి మనకు మనం తినే, తినాల్సిన కూరగాయలు, కాయగూరలు, పండ్లు మొదలైనవాటిలోనే సమస్త ఔషధ గుణాలను ప్రసాదించింది. కానీ, చాలామంది వీటిని నిర్లక్ష్యం చేసి జబ్బులనూ, వ్యాధులనూ కొని తెచ్చుకుంటారు. తీరా ట్రీట్మెంట్ తరువాత డాక్టర్లు కూరగాయలూ, పండ్లూ ఎక్కువగా తినండి అని చెప్తే అప్పుడు తినడం మొదలెడతాం. నిజానికి కూరగాయల్లో, పండ్లల్లో ఎన్నెన్ని ఔషధ గుణాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. అలాగే, చాలామంది చిన్నపిల్లలే గాక, పెద్దలు సైతం ఆకు కూరలను చిన్నచూపు చూడ్డం గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆకుకూరల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలుంటాయని నిపుణులు ఎప్పటికప్పుడు చెప్తూనే వుంటారు.  .

ఐతే ఏ సీజన్ లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో తినడం ఎంతో మంచిదనే విషయం కాస్త పరిజ్ఞానం వున్న ఎవరైనా చెప్తారు.

అలాంటివాటిలో దానిమ్మ పండు ఒకటి. దానిమ్మ పండును తినడంవల్ల మన ఆరోగ్యానికెంత మేలు కలుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఇది సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. దీని రుచి కూడా ఎంతో బావుంటుంది. రక్తహీనతగలవారు దానిమ్మ పండును క్రమం తప్పక తింటూంటే రక్తవృద్ధి కలుగుతుంది.

దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కావలసినన్ని వుంటాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మానికి నిగారింపును అందిస్తాయి. దానిమ్మ పండ్లను ఎక్కువగా తినేవారు ఎక్కువకాలం యవ్వనంగా వుంటారు. ఈ పండులోని పొటాషియం రక్తపోటును నియంత్రణలో వుంచుతుంది.

ఇక మరో ముఖ్యమైన విషయమేంటంటే అల్జీమర్స్, రొమ్ము క్యాన్సర్, చర్మ సంబంధిత క్యాన్సర్లకు దానిమ్మ అడ్డుకట్ట వేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. గర్భిణులైతే దానిమ్మను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే, గర్భస్థ శిశువు ఎదిగేందుకు కావలసిన పోషక విలువలెన్నో దానిమ్మ పండులో వుంటాయి. చూశారుగా, ఇన్ని సుగుణాలున్న దానిమ్మ పండును మనం నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ ? అందుకే, ఇప్పటి నుండీ దానిమ్మ పండును రెగ్యులర్ గా తిందాం, ఆరోగ్యంగా వుందాం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Uses of Pomegranate"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0