Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Formative assessment tests through OMR sheets from 1 to 8

చిన్నారులకు కొత్త పరీక్ష!

Formative assessment tests through OMR sheets from 1 to 8

  • 1 నుంచి 8 వరకు ఓఎంఆర్ షీట్ల ద్వారా ఫార్మటివ్ అసెస్మెంట్ పరీక్షలు
  • నూతన పరీక్ష విధానం
  • సామర్థ్యం అంచనాకు కసరత్తు

నూతన విద్యా విధానంలో భాగంగా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో జరగాల్సిన ఫార్మటివ్ అసెస్మెంట్-1 పరీక్షను ఈ విధానంలో నిర్వహించనున్నారు. గతంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రశ్నాపత్రాలు ఇచ్చి జవాబులు రాయిం చేవారు. ఈ సారి 1 నుంచి 8వ తరగతి విద్యా ర్దులకు కొత్త విధానంలో ఓఎంఆర్ షీట్లలో జవా బులు రాయాల్సి ఉంటుంది.

నూతన పరీక్ష విధానం ఇలా  ప్రస్తుతంప్రభుత్వం ఎస్ఏఎల్ (సపోర్టింగ్ ఆంధ్రా లెర్నింగ్ ట్రైనింగ్), ఈఐ (ఎడ్యుకేషనల్ ఎసన్షి యల్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. ఇందులో భాగంగా ఓఎంఆర్ షీట్ల ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జె క్టులో 15 బిట్లు ఉంటాయి. మరో 5 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏబీసీడీల్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. మిగిలిన ఐదింటికి ప్రశ్నాపత్రం ఇస్తారు. వీటికి విద్యార్థులు జవా బులు రాయాల్సి ఉంటుంది. 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎంఆర్ షీటు ఉంటుంది. మొదటి రోజు పరీక్ష అనంతరం ఉపా ద్యాయుడికి షీటు ఇవ్వాలి. తరువాత రోజు జరిగే పరీక్ష అప్పుడు అతనికి మళ్లీ ఓఎంఆర్ షీటు ఇస్తారు. అప్పుడు ఈ సబ్జెక్టుకు సంబంధించిన కాలమ్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. 9, 10 విద్యార్థులకు పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు.

సామర్థ్యం అంచనాకు కసరత్తు

విద్యార్థులకు ఇప్పటికే బేస్మెంటు ఎసెస్మెంటు నిర్వహించారు. వీరికి ఓఎంఆర్ షీట్లలో పరీక్షలపై శిక్షణ ఇస్తున్నా మని అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్ష అనం తరం ఓఎంఆర్ షీట్లను ఈఐకు అందజేసి స్కానర్ల ద్వారా మార్కులు కేటాయిస్తారు. వీటిని ఫార్మటివ్ అసెస్మెంటు-1 పరీక్షల మార్కులుగా నమోదు చేస్తారు. ఈ పరీక్షల అనంతరం క్లాసూం బేస్ మెంట్ ప్రోగ్రాం కింద విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా కసరత్తు చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Formative assessment tests through OMR sheets from 1 to 8"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0