Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A student who went to the police station for being beaten by a teacher.

 ఉపాధ్యాయుడు కొట్టాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విద్యార్థి. నచ్చజెప్పి వెనక్కి తీసుకొచ్చిన ఎంఈఓ.

A student who went to the police station for being beaten by a teacher.


ఉపాధ్యా యుడు కొట్టాడని పోలీసు స్టేషన్కు వెళ్లిన విద్యార్థిని ఎంఈవో నచ్చజెప్పి వెనక్కు తీసుకొచ్చిన ఘటన నెల్లూరుజిల్లా ఉద యగిరిలో బుధవారం కల కలం రేపింది . ఉదయగిరి మండల పరిధిలోని బిజ్జం పల్లి జడ్పీ హైస్కూల్లో శశికాంత్రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు . కొన్ని రోజులుగా పాఠశాలకు A డుమ్మాకొట్టిన శశికాంత్ రెడ్డి బుధవారం పాఠశా లకు వచ్చాడు . ఇన్ని రోజులు పాఠశాలకు ఎందుకు రాలేదంటూ గణిత ఉపా ధ్యాయుడు రఫీ మందలించి , బెత్తంతో వీపుపై కొట్టడంతో వాతలు పడ్డాయి . శశికాంత్రెడ్డి వెంటనే బయటకొచ్చి ఆటో ఎక్కి పోలీసుస్టేషన్కు చేరుకున్నాడు . ఈ విషయం మండల విద్యాశాఖాధికారి మోహన్రావుకు తెలియడంతో ఆయన హుటాహుటిన స్టేషన్కు చేరుకొని , కేసు నమోదు చేయొద్దంటూ ఎస్ ఐని కోరారు . అనంతరం విద్యార్థిని మండల విద్యావనరుల కేంద్రానికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు . ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి మాట్లాడారు . అనంతరం బెంగుళూరులో ఉన్న విద్యార్థి మేనమామకు ఫోన్ చేసి విషయం వివరించారు . మేనమామ స్నేహితులు వచ్చి విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు . ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థి స్టేషన్కు రావడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A student who went to the police station for being beaten by a teacher."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0