Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC New Notification

 APPSC New Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. APPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.

APPSC New Notification


APPSC New Notification : AP ఫారెస్ట్ సర్వీసెస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(Forest Range Officer) పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

APPSC New Notification : AP ఫారెస్ట్ సర్వీసెస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(Forest Range Officer) పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 3, ఫ్రెష్ వేకెన్సీ పోస్టులు 05 ఉన్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 17, 2022న విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది నవంబర్ 11, 2022 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 05, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీగా డిసెంబర్ 04, 2022గా ఉంది.

పోస్టుల వివరాలు.

జోన్ వన్ లో రెండు పోస్టులు, జోన్ 4లో ఒక పోస్టు మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జోన్ 2లో ఒక పోస్టు, జోన్ 3లో 03, జోన్ 4లో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 05 పోస్టులు ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి.

మొత్తం 08 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

అర్హతలు

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిజికల్ రిక్రూట్ మెంట్ అర్హతలు ఇలా.

  • అభ్యర్థి యొక్క ఎత్తు 163 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూదు. మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెం. మీ ఉండాలి.
  • చెస్ యొక్క కొలత 79 సెం. మీ ఉండాలి.
  • పరీక్షకు హాజరైన అభ్యర్థులను మెరిట్ ప్రకారం వాకింగ్ టెస్ట్ కు పిలుస్తారు. 4 గంటల్లో అభ్యర్థి 25 కిలోమీటర్లు నడవాల్సి పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు అయితే 4 గంటల్లో 16 కిలోమీటర్లు పూర్తి చేయాలి.

వయో పరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు

  • దరఖాస్తు చేసే అభ్యర్థుల రూ.250 దరఖాస్తు ఫీజును చెల్లించాలి. దీంతో పాటు రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎగ్జామినేషన్ ఫీజు  చెల్లింపులో ఎస్సీ, ఎస్టీ, BC, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.

మొత్తం 600 మార్కులకు ఆప్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.

జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు కు ఒక్కో సబ్జెక్ట్ కు 50 మార్కుల చొప్పున 100 మార్కులు కేటాయించారు. ఇవి కేవలం అర్హత మార్కులు మాత్రమే. ఈ మార్కులను మెరిట్ లో కలపరు.

పేపర్ 1 : జనరల్ స్టడీస్ అండ్ మెంటర్ ఎబిలిటీ- 150 మార్కులు

పేపర్ 2 : ఎస్సీస్సీ స్టాండర్డ్ లెవల్లో మ్యాథమెటిక్స్ - 150 మార్కులు

పేపర్ 3 : జనరల్ ఫారెస్ట్రీ -1 కు 150 మార్కులు

పేపర్ 4 : జనరల్ ఫారెస్ట్రీ -1 కు 150 మార్కులు కేటాయించారు.

మినిమం క్వాలిఫైంగ్ మార్కులను కేటగిరీల వారీగా విభజించారు. జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి. ఇక మెరిట్ ప్రకారం సెలక్టైన అభ్యర్థులకు వాకింగ్ టెస్టుకు 1:3 చొప్పున పిలుస్తారు. అంటే ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఈ ఫిజికల్ టెస్టుగా హాజరు కావాల్సి ఉంటుంది.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC New Notification"

Post a Comment