Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are spam calls bothering you? If you just do this, the details will not come again.

Spam Calls : స్పామ్ కాల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ? జస్ట్ ఇలా చేస్తే మళ్లీ రావు వివరాలు.

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత స్పామ్ కాల్స్ విపరీతంగా వేధిస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చే స్పామ్ కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి.

ముఖ్యమైన పని ఉన్న సందర్భాల్లో ఈ స్పామ్ కాల్స్ రావడం మూలంగా చిరాకు, కోపం వస్తుంది. వీటిలో కొన్ని ప్రచారం కోసం వచ్చే కాల్స్ కాగా, మరికొన్ని మోసపూరిత కాల్స్ ఉంటాయి. ఈ ఏడాది అమెరికాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సుమారు 52 బిలియన్లకు పైగా రోబోకాల్స్ అందుకున్నట్లు యూమెయిల్ అనే సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి వారం సుమారు 1 బిలియన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించింది.

వాస్తవానికి మనకు వచ్చే కాల్స్ లో ఎక్కువగా రోబో కాల్స్ ఉంటాయి. ఈ కాల్స్ ముందుగా రికార్డు చేయబడి ఉంటాయి. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్ గా రికార్డు అయిన వాయిస్ ను వినిపిస్తుంది. టెలి మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా వస్తుంటాయి. ప్రజలకు తమ ప్రొడక్ట్స్ గురించి వివరించి మార్కెట్ చేసుకునేందుకు పలు కంపెనీలు ఈ కాల్స్ చేస్తుంటాయి. అటు మోసపూరిత ఉద్దేశంతో కూడిన స్పామ్ కాల్స్.. యూజర్లకు సంబంధించిన బ్యాంక్ డేటా సహా అత్యంత ముఖ్యమైన వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి అవాంఛిత కాల్స్ నుంచి రక్షణ పొందేందుకు గూగుల్ రెండు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్లు కాలర్ ID, స్పామ్ ప్రొటెక్షన్ లతో డిఫాల్ట్‌ గా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆన్ అవుతాయి. ఒక వేళ ఆన్ చేయకపోతే వినియోగదారులు స్పామ్ కాల్స్ రాకుండా ఉండేలా ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.

ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.

  • 1: ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • 2: ఇప్పుడు 'మోర్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • 3: ఆ తర్వాతసెట్టింగ్‌ల బటన్‌ ను ఎంచుకోవాలి.
  • 4: 'స్పామ్, కాల్ స్క్రీన్'ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • 5: కాలర్ & స్పామ్ ID ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసుకోవాలి.

స్పామ్ కాల్స్ ను ఎలా గుర్తించాలి

వాస్తవానికి గూగుల్ ఆయా కాల్స్ ను పరిశీలించి అవాంఛిత కాల్ గా భావిస్తే రాకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ గూగుల్ నుంచి తప్పించుకుని వస్తే ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోన్ కాల్ లో దాన్ని బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

  • ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • యాప్ కింది భాగంలో రీసెంట్ ట్యాబ్‌ను నొక్కాలి.
  • ఇప్పుడు మీరు స్పామ్‌ గా రిపోర్టు చేయాలి అనుకుంటున్న కాల్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు బ్లాక్ చేయాలి. లేదంటే, స్పామ్ రిపోర్టు కొట్టాలి.
  • కొన్ని వైర్‌లెస్ క్యారియర్‌లు కూడా కాల్ బ్లాకింగ్ ఫీచర్‌ను అందిస్తాయి. 
  • AT&T ActiveArmor Ios, Android కోసం అందుబాటులో ఉంది. 
  • ఇది స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేస్తుంది. T-Mobile స్కామ్ షీల్డ్ కస్టమర్లను రోబోకాల్స్ నుంచి రక్షించడానికి బహుళ ఫీచర్లను కలిగి ఉంటుంది. 
  • రోబోకాల్స్ సంఖ్యను పరిమితం చేయడానికి థర్డ్ పార్టీ యాప్ లను కూడా ఉన్నాయి. 
  • Hiya అనే యాప్ కూడా స్పామ్ కాల్స్ ను నిరోధిస్తుంది. 
  • Nomorobo కూడా వినియోగదారులకు స్పామ్ కాల్స్ ను రాకుండా చేస్తుంది.
  •  ఫైర్‌వాల్ యాప్ ఐఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 
  • ఇది అవాంఛిత కాల్‌లను నిరోధించడంలో బాగా పనిచేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are spam calls bothering you? If you just do this, the details will not come again."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0