Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you making these mistakes in offering to God? But bad luck for the house !Explanation.

 vastu tips : దేవుడికి నైవేద్యం విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా ? అయితే ఇంటికి దురదృష్టం !వివరణ.

Are you making these mistakes in offering to God?  But bad luck for the house !Explanation.

భారతీయ సంస్కృతిలో భగవంతుని పూజలో ముఖ్యమైనది, అతి పవిత్రమైనది దేవునికి నైవేద్యం సమర్పించడం. భగవంతుడికి నైవేద్యం సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని, తన భక్తులకు సంతోషాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తాడని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు.

అయితే భగవంతుడికి నైవేద్యం సమర్పించే విషయంలో కూడా వాస్తు నిబంధనలు పాటించాలి. ఆ నిబంధనలు పాటించకుంటే ఇంట్లో కష్టాలు రావడానికి ఎక్కువ సమయం పట్టదని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దేవునికి సమర్పించాల్సిన నైవేద్యాలకు సంబంధించిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం

నైవేద్యం విషయంలో జాగ్రత్త లేకుంటే అన్నీ కష్టాలే

వాస్తు శాస్త్రంలో దేవుడికి నివేదించిన ఆహారపదార్థాలను నైవేద్యం అని అంటారు. ఈ నైవేద్యం చాలా పవిత్రమైనది మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. చాలా మంది దేవుడి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఆ నైవేద్యాన్ని తిరిగి, భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే, మరికొంతమంది దానిని దేవుడి దగ్గరే ఉంచేస్తారు. అయితే దేవుని దగ్గర ప్రసాదం విషయంలో చోటుచేసుకునే గందరగోళం, నియమాలు తెలుసుకుని, జాగ్రత్తలు పాటించకుంటే కొన్నిసార్లు వారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది.

దేవుడికి నివేదించిన నైవేద్యం ప్రసాదంగా తినటం వల్ల ఆరోగ్యం

అసలు దేవుడికి నివేదించిన పదార్థాలను మనం తినకూడదని కూడా ధర్మ శాస్త్రాలు చెబుతాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా భగవంతుడికి నైవేద్యం పెట్టడమే కాకుండా, వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినడం చాలామంది అలవాటుగా పెట్టుకుంటారు. భగవంతుడికి నైవేద్యం గా పెట్టిన పదార్ధాలు తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భగవంతుడికి నైవేద్యంగా పెట్టే పదార్థాలను మనం శుచి, శుభ్రతతో వండుతాము. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత శ్రద్ధతో, నిర్మలమైన మనసుతో, సమయాభావం లేకుండా జాగ్రత్తగా వాడతాము కాబట్టి ఆ పదార్థాలను దేవుడికి నివేదించిన తర్వాత మనము స్వీకరించటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

భగవంతుని ఎదుట నైవేద్యాన్ని పెట్టి అలాగే మర్చిపోతే జరిగేదిదే

నిజానికి, దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన కొంత సమయం తరువాత, దానిని అక్కడ నుండి తీసివేయాలి. ఇది చేయకపోతే తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రతికూల శక్తులు అక్కడికి వచ్చి ఆ ఇంట్లోని కుటుంబ ఆనందాన్ని పాడుచేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తులకు అనేక కష్టాలు వస్తాయని చెబుతున్నారు. వాస్తు శాస్త్రాల ప్రకారం, నైవేద్యాన్ని దేవుని విగ్రహం ముందు రాగి, వెండి, బంగారం, రాయి, మట్టి లేదా చెక్క పాత్రలో ఉంచాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి భగవంతుని కృప ఉంటుందని చెబుతారు.

ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవాలి, అలాగే 10మందికి పంచాలి

భగవంతునికి నివేదించిన నైవేద్యం కొంత సమయం తరువాత, ప్రసాదం రూపంలో ఉంటుందని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో, ఆ ప్రసాదాన్ని స్వయంగా స్వీకరించాలి. అలాగే వీలైతే ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. ఇలా చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు మరియు ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కనికరిస్తాడు. ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాన్ని భక్తితో పాటిస్తున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతారు.

నైవేద్యం భగవంతుని ముందే పాడైపోతే ప్రతికూల ఫలితాలు

అందుకే ఎప్పుడైనా భగవంతుని ముందు పెట్టిన నైవేద్యం కాసేపటి తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. అలా కాకుండా భగవంతుని ముందు పెట్టిన నైవేద్యం అలాగే వదిలేస్తే అది పాడైపోతుంది. పాడైపోయిన నైవేద్యం భగవంతుని ముందు ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇది గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you making these mistakes in offering to God? But bad luck for the house !Explanation."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0