Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC issued the notification.

కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టులు .. నోటిఫికేషన్ విడుదల చేసిన SSC.

SSC issued the notification.

SSC  కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), ఎస్‌ఎస్‌ఎఫ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్‌ (జీడీ)

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌..

 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), ఎస్‌ఎస్‌ఎఫ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 24,205 జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), సహస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.

మొత్తం పోస్టులు: 24,205

ఖాళీల వివరాలు.

కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ)/ సిపాయి: 24369 పోస్టులు

పార్ట్ - 1 ఖాళీలు:

1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌): 10497 పోస్టులు(పురుషులు- 8922; మహిళలు- 1575)

2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌): 100 పోస్టులు(పురుషులు- 90; మహిళలు- 10)

3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌): 8911 పోస్టులు(పురుషులు- 8380; మహిళలు- 531)

4. సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ): 1284 పోస్టులు(పురుషులు- 1041; మహిళలు- 243)

5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 1613 పోస్టులు(పురుషులు- 1371; మహిళలు- 242)

6. అస్సాం రైఫిల్స్(ఏఆర్‌): 1697 పోస్టులు (పురుషులు-1697)

7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌): 103 పోస్టులు (పురుషులు- 78; మహిళలు- 25)

పార్ట్ - 2 ఖాళీలు:

8. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ): 164 పోస్టులు

అర్హత: ఇంటర్‌ లేదా 10+2 ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు 26 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌ మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

జీత భత్యాలు: సిపాయి పోస్టుకు రూ.18,000-రూ.56,900 వరకు, ఇతర ఖాళీలకు రూ.21,700-రూ.69,100 మధ్య చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సీబీఈ పరీక్ష విధానం: ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ అంశాలనుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: 

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు మొదలు: 27-10-2022 

దరఖాస్తు కు  చివరి తేదీ: 30-11-2022.

ఆఫ్‌లైన్ చలానా రూపొందించేందుకు చివరి తేదీ: 30-11-2022.

 ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-12-2022.

చలాన్ ద్వారా చెల్లింపు చివరి తేదీ:  01-12-2022

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: జనవరి, 2023


వెబ్‌సైట్‌: https://www.ssc.nic.in లేదా http://www.crpf.gov.in

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC issued the notification."

Post a Comment