Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Can money be withdrawn at post office without nominee? What is the process?

 Post Office : పోస్టాఫీసులో నామినీ లేకుండా డబ్బు తీసుకోవచ్చా  ? ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ?

దేశంలో పోస్టాఫీసులు మరింతగా అభివృద్ది చెందుతున్నాయి. వినియోగదారులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు ప్రస్తుతం అన్ని రకాల స్కీమ్‌లు, సేవలు అందిస్తున్నాయి.

దేశంలో పోస్టాఫీసుల కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. అయితే ఏదైనా అకౌంట్‌ తీస్తే అందులో నామినీ పేరు చేర్చడం తప్పనిసరి. పోస్టాఫీసులు సేవింగ్స్‌ ఖాతా ఓపెన్‌ చేసే సమయంలో కస్టమర్లు నామినీ కాలమ్‌ను పూరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కారణంగా ఖాతాదారుడు మరణిస్తే అటువంటి పరిస్థితిలో ఖాతాలో జమ చేసిన డబ్బు నామినీకి ఇవ్వబడుతుంది. అయితే ఫారమ్ నింపేటప్పుడు ప్రజలు నామినీని నింపడం మర్చిపోవడం చాలాసార్లు గమనించినట్లు పోస్టాఫీసు అధికారులు చెబుతున్నారు. తరువాత డబ్బు క్లెయిమ్ చేయడంలో సమస్యలు ఎదుర్కొవచ్చు.

నామినీ లేకపోతే..

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో నామినీ లేకుంటే 5 లక్షల లోపు మొత్తానికి ప్రత్యేక నిబంధన పెట్టారు. దీని ప్రకారం ఎవరైనా ఖాతాలో రూ.5 లక్షల లోపు డిపాజిట్ ఉండి మరణిస్తే ఖాతాదారుని మరణ ధ్రువీకరణ పత్రాన్ని పోస్టాఫీసులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే క్లెయిమ్ ఫారమ్‌ను పూరించాలి. ఆపై అతను నష్టపరిహారం, అఫిడవిట్, కేవైసీ పత్రం (ఆధార్ కార్డ్), ఇతర వివరాలతో పాటు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

దీని తర్వాత మీ అన్ని పత్రాలు తనిఖీ చేస్తారు అధికారులు. మీ క్లెయిమ్ ఫారమ్ క్రాస్ చెక్ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు క్లెయిమ్ చేస్తారు. ఈ క్లెయిమ్‌ను 6 నెలలలోపు చేయవచ్చు.

5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే ఏం చేయాలి?

మీ ఖాతాలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ జమ అయినట్లయితే, మీరు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం చాలా ముఖ్యం. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఖాతాదారునికి నిజమైన వారసుడని నిరూపించుకోవాలి. దీని తర్వాత మీరు పైన పేర్కొన్న మిగిలిన పత్రాలను కూడా సమర్పించాలి. ఖాతాలో జమ చేసిన డబ్బుకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Can money be withdrawn at post office without nominee? What is the process?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0