Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CBA exams along with formative and summative

ఫార్మేటివ్, సమ్మేటివ్ తో పాటే సీబీఏ పరీక్షలు

CBA exams along with formative and summative

  • వెల్లడించిన పాఠశాల విద్యాశాఖ
  •  విధివిధానాల ప్రకటన

ఈ ఏడాది ఫార్మేటివ్, సమ్మే.. టివ్తో పాటు సీబీఏ (క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్) పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్ల డించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన వి డుదల చేసింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లోనే కొన్ని సీబీఏ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. సీబీఏ పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అనుసరించేవిధి విధానాలను కూడా ప్రకటించింది.

మూడు పరీక్షలు సీబీఏ విధానంలో.

ఈ ఏడాది కొత్తగా రెండు నిర్మాణాత్మక, ఒక సంగ్రహణాత్మక పరీక్షలను సీబీఏ పరీక్షలుగా నిర్వహించేందుకు పాఠశాల నిర్ణయించింది. మిగిలిన రెండు నిర్మాణాత్మక, ఒక సంగ్రహణాత్మక పరీక్షలను పాత పద్ధతిలో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు అవసరమయ్యే ముద్రణ, ప్యాకింగ్, రవాణా, జీఎస్టీ ఖర్చులు కలుపుకుని పేజీకి నిర్ణీత మొత్తంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకుఈ ఖర్చు ను ఈ సమగ్ర శిక్ష ద్వారా జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులకు ప్రభుత్వం అందిస్తుంది. వారి స్థాయిలో ముద్రణ వ్యవహారాలు నిర్ణయిస్తారు. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ప్రశ్నాపత్రాలు విద్యార్థుల్లోని ఉన్నత స్థాయి నైపుణ్యాలను వెలికితీసేలా ఉంటాయి. కనుక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు

కూడా లబ్ధి పొందేలా ప్రభుత్వం వారికి కూడా ఈ ప్రశ్నాపత్రాలు అందించాలని నిర్ణయించింది. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక పరీక్షల ప్రశ్నాపత్రం సుమారు 10 నుంచి 20 పేజీల వరకు ఉండవచ్చు. కనుక 6 సబ్జెక్టులకు అన్ని పరీక్షలకు కలిపి వారి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డుల నిర్ణయం మేరకు పేపర్ ధర, ముద్రణ, ప్యాకింగ్, రవాణా,

జీఎస్టీ ఖర్చులు నిర్ధారించి వసూలు చేస్తారు. 

ప్రైవేట్ పాఠశాలలకు ఓఎమ్మార్ ఇవ్వరు

సాల్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉత్తమమైన అసెస్మెంట్లు అందించడం, వాటి విశ్లేషణ చేయడం, రేమిడియల్ బోధనకు సహకారం అందించేందుకు ఎడ్యుకేషన ఇనిషియేటివ్స్ ప్రభుత్వం కుదుర్చుకుంది. అందువల్ల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులు ఓఎమ్మార్ షీట్లను అందించడం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CBA exams along with formative and summative"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0