Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Dussehra : If you want success to be yours.. Do's and Don'ts on Dussehra.

 Dussehra : సక్సెస్ మీ సొంతం కావాలంటే.. దసరా రోజున చేయవలసినవి, చేయకూడనివి ఏమిటో వివరణ.

Dussehra : If you want success to be yours.. Do's and Don'ts on Dussehra.
ఈ పండుగ రోజున శక్తి స్వరూపం అమ్మవారిని పూజిస్తే..  జీవితానికి సంబంధించిన కష్టాలను తొలగించి, కోరికలు నెరవేరుస్తుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో విజయదశమికి  పూజకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. దసరా రోజున మనం ఏమి చేయాలి.. ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున విజయదశమి లేదా దసరా పండుగను జరుపుకుంటారు. నేడు దసరా వేడుకలను దేశ వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు రావణుడిని చంపి లంకను జయించాడు. ఈ రోజునే దుర్గాదేవి మహిషాసురుడిని వధించిందని కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ పండుగ రోజున శక్తి స్వరూపం అమ్మవారిని పూజిస్తే..  జీవితానికి సంబంధించిన కష్టాలను తొలగించి, కోరికలు నెరవేరుస్తుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో విజయదశమికి  పూజకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. దసరా రోజున మనం ఏమి చేయాలి.. ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

దసరా రోజున చేయాల్సిన పనులు

  • జీవితం ఆనందంగా ఉండాలంటే కోరిన కోరికలు నెరవేరాలంటే, దసరా రోజున సంపూర్ణ భక్తితో శ్రీరామచరిత్రను  పఠించాలి.
  • విజయదశమి రోజున శివుని స్వరూపంగా భావించే నీలకంఠుని దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, వీలైతే పాల పిట్టను దర్శించుకోండి.
  • ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి, సంపదల దేవత అనుగ్రహం పొందడానికి దసరా రోజున దేవాలయంలో పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి.
  • దసరా రోజు అదృష్టం ఆరోగ్యాన్ని పొందడానికి  కొబ్బరికాయను దిష్టి తీసి  అగ్నిలో వేయండి. ఈ చర్య తీసుకోవడం ద్వారా మనిషి జీవితానికి సంబంధించిన వ్యాధులు, బాధలు తొలగిపోతాయి.
  • జీవితంలో సుఖసంపదలను పొందడానికి, దసరా రోజున అవసరంలో ఉన్న వ్యక్తికి దానం ఇవ్వండి. వీలైతే గుప్త దానం చేయండి.
  • దసరా రోజున శత్రువులను జయించేందుకు శఙ్ఖా పుష్పాలతో ప్రత్యేకంగా పూజించండి.
  • మీ జాతకంలో శనికి సంబంధించిన దోషం ఉంటే, కష్టాలను నివారించడానికి, విజయదశమి నాడు జమ్మి మొక్కను పూజించండి.
  • దసరా రోజున ఏదైనా పూజ చేసిన తర్వాత మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు.

దసరా రోజున చేయకూడని పనులు

  • చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రసిద్ధి.. అటువంటి పరిస్థితిలో, ఈ రోజును మరచిపోయి ఎటువంటి చెడు పని చేయవద్దు.
  • శ్రీ రాముడి ఆశీస్సులు పొందడానికి.. ఎదుటివారిని అవమానించవద్దు.
  • విజయదశమి రోజున ఎవరితోనూ వాదించవద్దు. ఎవరితోనూ అబద్ధాలు చెప్పవద్దు.
  • దసరా రోజున మాంసం, మద్యం వంటి వాటికీ దూరంగా ఉండాలి.
  • విజయదశమి రోజున చెట్లను, మొక్కలను నరకవద్దు. ఏ జంతువును చంపకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Dussehra : If you want success to be yours.. Do's and Don'ts on Dussehra."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0