Good news .. Age limit for applying for government jobs has been increased.
గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయోపరిమితి పెంపు.
ఏపీ నిరుద్యోగులకు జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయోపరిమితి పెంపు వెసులుబాటును పొడిగిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది ప్రభుత్వం. 2023 సెప్టెంబర్ వరకూ ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం…. ఏపిపీఎస్సీ సహా మిగతా ప్రభుత్వ నియామక సంస్థలు ఈ అంశాన్ని నోటిఫై చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక అటు.. తాజాగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఏకంగా 92 గ్రూప్1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఎపీపీఎస్సీ. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే.. ఎఎంవీఐ ఉద్యోగాలకు నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేసింది.
0 Response to "Good news .. Age limit for applying for government jobs has been increased."
Post a Comment