Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you are closing your savings account, keep these things in mind.

 సేవింగ్స్‌ ఖాతా మూసేస్తున్నారా అయితే ఈ విషయాలు గుర్తుంచుకోగలరు.

If you are closing your savings account, keep these things in mind.

అవసరం కొరకో.. ప్రయోజనం కోసమో.. మనలో చాలామంది ఒకే బ్యాంక్‌లో లేదా వేర్వేరు బ్యాంకుల్లో ఒకటికి మించి పొదుపు ఖాతాల్ని తెరుస్తున్నవారే. ఈ క్రమంలో పనైపోయాక సదరు ఖాతాల్లో నుంచి కనీస నగదు నిల్వల్ని తీసుకుని అలాగే వదిలేస్తున్నవారెందరో. అయితే దీనివల్ల ఆర్థిక మోసాల బారినపడే ప్రమాదమున్నది. ఇక ఖాతాల్లో సరిపడా నగదు నిల్వలు లేక జరిమానాలను ఎదుర్కొంటున్నవారూ ఉన్నారు. దీంతో అనవసరపు సేవింగ్స్‌ అకౌంట్లను మూసేందుకు నిర్ణయించుకోవడం సహజమే. అయితే అప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి.

బ్యాలెన్స్‌-స్టేట్‌మెంట్‌

ఏదైతే సేవింగ్స్‌ ఖాతాను మూసేయాలనుకుంటున్నారో అందులో ఎంత నగదు ఉందన్నది తప్పక చూసుకోవాలి. అలాగే బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను తీసుకొని కనీసం 2-3 ఏండ్లు దాచుకోవాలి. దీనివల్ల ఏదైనా లావాదేవీ గురించి తెలుసుకోవాలంటే సులభమవుతుంది. అంతేగాక ఐటీ రిటర్నుల దాఖలుకూ ఈ స్టేట్‌మెంట్‌ పనికొస్తుంది.

బకాయిలు-చార్జీలు

ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే దానికి సంబంధించిన బకాయిల్ని చెల్లించకుండా ఆ ఖాతాను మూసేందుకు బ్యాంకులు ఒప్పుకోవు. అలాగే ఇతర సేవలకు సంబంధించిన చార్జీలనూ తప్పక చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయే వీలున్నది. ఖాతా క్లోజింగ్‌ చార్జీలూ ఉంటాయన్నది మరువద్దు.

ఆటో డెబిట్‌

ఆటో, గృహ తదితర రుణాలకు సంబంధించిన ఈఎంఐలు.. క్లోజ్‌ చేసే ఖాతా నుంచే నెలనెలా కట్‌ అవుతుంటే వాటన్నింటిని మరో ఖాతాకు ముందుగానే బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డిఫాల్టర్‌ ముద్రపడే ప్రమాదమున్నది. అంతేగాక పెట్టుబడులు, ఈపీఎఫ్‌వో, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతానే లింకై ఉంటే మార్పించుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you are closing your savings account, keep these things in mind."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0