Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The AP government gave good news to the unemployed! Jobs with degree and diploma qualification..

 నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం ! డిగ్రీ , డిప్లొమా అర్హతతో జాబ్స్.

The AP government gave good news to the unemployed!  Jobs with degree and diploma qualification..

క్టోబర్ నెల మొత్తం ఉద్యోగ పర్వంలా, ఉద్యోగ మాసంలా ఉంది. ఇప్పటికే గ్రూప్ 1ఫారెస్ట్ సర్వీస్, ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ వంటి వాటిలో పలు ఉద్యోగాలతో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.

21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఏపీ నిరుద్యోగ యువతకు సీఎం జగన్ దీపావళి కానుక ఇచ్చినట్టు అయ్యింది. తాజాగా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో టైయప్ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ జాబ్ మేళా ద్వారా ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


మొత్తం ఖాళీలు: 150

పోస్ట్: ట్రైనీ

జీతం: 13,200/- + షిఫ్ట్ అలవెన్సు

అర్హతలు:

  • డిప్లొమా (ఈఈఈ,ఈసీఈ, మెకానికల్, కంప్యూటర్స్)
  • బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ)

పాసైన సంవత్సరం: 2020, 2021 & 2022

షరతులు:

  • డిప్లొమా, డిగ్రీ ఆల్ క్లియర్ అయి ఉండాలి. బ్యాక్ లాగ్స్ ఉండకూడదు.
  • ఆడవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయసు పరిమితి: 25 ఏళ్ల కంటే తక్కువ

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ ప్రక్రియ: HR రౌండ్ ఉంటుంది.

జాబ్ లొకేషన్: శ్రీ సిటీ, తడ, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 517646

ట్రైనింగ్ పీరియడ్: 5 రోజులు

ప్రయోజనాలు:

  • సంస్థ క్యాంటీన్ లో రోజుకి 2 సార్లు ఫుడ్ ఉంటుంది.
  • మొదటి 3 నెలలు హాస్టల్ వసతి ఉచితంగా కల్పిస్తారు.
  • జాబ్ వస్తే ఫ్యాక్టరీకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కల్పించి, యూనిఫార్మ్, షూస్ ఇస్తారు.
  • మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
  • ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ ఉంటాయి.

ఇంటర్వ్యూ తేదీ, ఇంటర్వ్యూ వేదిక: కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వెల్లడిస్తారు.

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 24.10.2022

ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే సంప్రదించండి

  • ఎస్. దినకర్, 8121585857
  • ఏపీఎస్ఎస్డీసీ హెల్ప్ లైన్ నంబర్: 99888 53335


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The AP government gave good news to the unemployed! Jobs with degree and diploma qualification.."

Post a Comment