Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Central Board of Indirect Taxes and Customs of the Ministry of Finance of India has released a notification for the recruitment of various posts.

 8,10 వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు . 25 వేల నుంచి 81 వేల వరకు జీతం !

The Central Board of Indirect Taxes and Customs of the Ministry of Finance of India has released a notification for the recruitment of various posts.

భారత ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టిండల్‌, సుఖాని, ఇంజిన్‌ డ్రైవర్‌, లాంచ్‌ మెషిన్‌, ట్రేడ్స్‌మ్యాన్‌, సీమ్యాన్‌ విభాగాల్లో 27 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య వివరాలు:

మొత్తం ఖాళీలు: 27

విభాగాలు:

టిండల్ – 05

సుఖాని – 10

ఇంజిన్ డ్రైవర్ – 04

లాంచ్ మెకానిక్ – 05

ట్రేడ్స్‌మ్యాన్‌ – 02

సీమ్యాన్ – 01

అర్హతలు:

టిండల్, సుఖాని, ఇంజిన్ డ్రైవర్, లాంచ్ మెకానిక్ ఉద్యోగాలకు 8వ తరగతి అర్హత కాగా, సీమ్యాన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. ఇక ట్రేడ్స్‌మ్యాన్‌ ఉద్యోగాలకు కనీస అర్హత 10వ తరగతి కాగా మెకానిక్/డీజిల్/ఫిట్టర్/టర్నర్/ఎలక్ట్రీషియన్/ కార్పెంట్రీ/ఇంస్ట్రుమెంటల్ కోర్సుల్లో ఐటీఐలో ఉతీర్ణత సాధించి ఉండాలి. అలాగే.. ఉద్యోగాలను బట్టి 3 నుంచి 10 ఏళ్ల వరకు సంబంధిత పనిలో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

సీమ్యాన్, ట్రేడ్స్మేన్ ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ళ లోపు వారు, సుఖాని, లాంచ్ మెకానిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ళ లోపు వారు, టిండల్, ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలకు 18 నుంచి 35 ఏళ్ళ లోపు వారు అర్హులు.

జీత భత్యాలు:

టిండల్ – రూ. 25,500 నుంచి రూ. 81,100

సుఖాని – రూ. 25,500 నుంచి రూ. 81,100

ఇంజిన్ డ్రైవర్ – రూ. 25,500 నుంచి రూ. 81,100

లాంచ్ మెకానిక్ – రూ. 25,500 నుంచి రూ. 81,100

ట్రేడ్స్మేన్ – రూ. 19,900 నుంచి రూ. 63,200

సీమ్యాన్ – రూ. 18,000 నుంచి రూ. 56,900

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తును చివరి తేదీ: 14.11.2022

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Central Board of Indirect Taxes and Customs of the Ministry of Finance of India has released a notification for the recruitment of various posts."

Post a Comment