Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tirumala Latest News

Tirumala News : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - దర్శనం వేళలపై టీటీడీ తాజా ప్రకటన వివరాలు.

Tirumala Latest News


 Tirumala Latest News: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) రద్దు చేసింది.

విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం 16-10-2022 రోజున 84,794 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 35,560 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.67 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.
ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి వారికి కైంక్యర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

సర్కారు హారతి తరువాత భక్తులను దర్శనభాగ్యం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిర "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవమూర్తుల విగ్రహాలు పరిరక్షణలో భాగంగా టీటీడీ రద్దు చేసింది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tirumala Latest News"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0