Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To be recognized as a national party. What are the qualifications?

 జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే . ఏయే అర్హతలు ఉండాలి.

To be recognized as a national party. What are the qualifications?

National Party : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)ని 'భారత్‌ రాష్ట్ర సమితి' (బీఆర్‌ఎస్‌)గా మార్చిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును 'భారత్‌ రాష్ట్ర సమితి' (బీఆర్‌ఎస్‌)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం (అక్టోబర్ 5,2022) తీర్మానం చేసిన సంగతి విధితమే.

దసరా రోజున సీఎం కేసీఆర్ ను టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును ఇక నుంచి బీఆర్‌ఎస్‌గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు జాతీయ పార్టీ అంటే ఏమిటి? ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి తేడా ఏమిటి? ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఏం చెప్తున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ ఏ నిబంధనలు పాటించాలి? ఎన్నికల కమిషన్‌ ఏం చెబుతోంది?

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే అర్హతలు ఉండాలి.

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ క్రింది మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి.

1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్‌ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు గెలవాలి.

2. ఏవైనా నాలుగు రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు (2 శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.

3. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకునే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.

హోదా శాశ్వతం కాదు.

జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే ఆ హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి హోదా ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. ఈ కారణంగానే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య తరుచూ మారుతుంది.

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.

ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ కింది నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పాటించాలి.

రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు సాధించడంతోపాటు 2 అసెంబ్లీ స్థానాలు గెలవాలి.

ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లతోపాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.

ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.

ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.

లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై, చెల్లిన ఓట్లలో 8% వచ్చి ఉండాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To be recognized as a national party. What are the qualifications?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0