Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is special about Diwali? Why do we celebrate it?

 దీపావళి విశిష్టత ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటాము?

What is special about Diwali?  Why do we celebrate it?

దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది. ఈ ఏడాది నవంబరు 14 శనివారం నాడు జరుపుకోనున్నారు. అయితే అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? పౌరాణిక చరిత్ర ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి ఎందుకు జరుపుకుంటామో వివరణ.

రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ 'భగినీహస్త భోజనం'’తో ముగుస్తుంది.

​ధంతేరాస్ లేదా ధనత్రయోదశి.

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుంది.

ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతోపాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని.. ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది.

​దీపావళి అమావాస్య.

ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. స్య! భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం.

తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం.

​బలి పాడ్యమి

దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివస్‌గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.

​భగిని హస్త భోజనం

ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ని ఎంతగానో అభిమానించేది. నిత్యమూ తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరికి ఇంటికి యుముడు వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది.

దీనికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు.. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది... కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి అభ్యంగనస్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What is special about Diwali? Why do we celebrate it?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0