Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Motivate Your Child

 Motivate Your Child : ఈ పది సూత్రాలను పాటించి పిల్లల్లో మంచి రీడింగ్ స్కిల్స్ ప్రోత్సహించండి .. ! టాప్ 10 టిప్స్ ఇవిగో .. !  


పుస్తకం పట్టుకుని చదువుకోవడం అలవాటు తప్పిపోతుంది . పెద్దలు , పిల్లల్లో పుస్తకపఠనం తగ్గిపోతుంది . దానికి స్మార్ట్ ఫోన్స్ , కంప్యూటర్స్ , ట్యాబ్స్ లలో చదవడానికి అలవాటు పడడమే కారణంగా చెపుతారు కానీ.

చదివే ఒపిక లేకపోవడం, చదవాలనే ఆసక్తి కలిగకపోవడం కూడా కారణాలే... ఒకప్పుడు గంథాలయాలకు వెళ్లి చదివేవారు, లేదా ఉదయాన్నే పేపర్ చదివేవారు మరిప్పుడు అవన్నీ తగ్గాయి. ఇక భవిష్యత్ తరాలకు పుస్తకం చదవడం అంటే ఏంటో తెలీకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే పుస్తక పఠనాన్ని పిల్లల్లో పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత దానికోసం ఏం చేయాలంటే..ఈ ట్రిప్స్ పాటించండి.

1. లక్ష్యాలను సెట్ చేయండి..

బిడ్డ పెరిగి పెద్దయ్యే కొద్దీ జీవితంలో ఏం సాధించాలనే లక్ష్యాన్ని పిల్లల్లో చిన్నతనం నంచే కలిగించే బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీదే ఉంటుంది. పిల్లల్ని చిన్నతనం నుంచే పుస్తకాల వైపు దృష్టి మళ్ళించాలి. ఇప్పటికాలంలో పెద్దలే అన్నం తినిపించాలన్నా, చెప్పిన పని చేయాలన్నా, లాలిపుచ్చి జోలపాడాలన్నా అన్నింటికీ స్మార్ట్ ఫోనే అంతెందుకు నెలల వయసునుంచే స్మార్ట్ ఫోన్స్ కి అలవాటు చేస్తున్నారు. ఇది పిల్లల్లో ఆలోచించే శక్తిని మందగించేలా చేస్తుందంటున్నారు నిపుణులు..

2. మంచి రీడర్..

పిల్లలు మంచి రీడర్ గా ఉండటం అంటే వాళ్లకి ఒక్క పుస్తకం విషయాలనే కాకుండా ప్రపంచంలోని ప్రతి సంగతినీ తెలుసుకునేలా చేయాలి.. దీనికోసం దానిమీద పిల్లలతో తల్లిదండ్రులే మాట్లాడాలి. సమయాన్ని ఇవ్వాలి. చర్చలు చేయాలి. రోజులో స్కూల్, మిగిలిన యాక్టివిటీస్ తో పాటు రీడింగ్ సమయం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

3. బిగ్గరగా చదివే అలవాటు చేయండి..

పిల్లలు చదివేటప్పుడు పైకి వినబడేలా చదవడం అలవాటు చేయాలి ఇది పిల్లల్లో గ్రహణ శక్తిని, పదజాలం సరిచేసుకునే విధంగా ప్రభావితం చేస్తుంది. చదువుతున్నప్పుడు వాళ్ళు పదాలను పలికే తీరు తల్లిదండ్రులు సరిచేసే అవకాశం కూడా ఉంటుంది.

4.రీడింగ్ మెటీరియల్..

చదివేందుకు పుస్తకాలను కొనేయడం కాకుండా అవి పిల్లలను ఆకర్షించి చదివిస్తాయా లేదా అనేది ఆలోచించాలి. పిల్లలు పెద్ద పెద్ద బొమ్మలు, రంగులు ఉన్న అట్టలతో ఉండే పుస్తకాలను, కథల పుస్తకాలను ఇష్టపడతారు. వాటిని తెచ్చి ఇవ్వాలి. చదివే ముందు కథను ఆశక్తిగా వివరించడం వల్ల పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది. స్వయంగా చదివి ఆనందించడానికి వారిని ప్రోత్సహించాలి.

5. కుటుంబం అంతా పుస్తక ప్రియులైతే

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా కలిసి చదివే విధంగా రోజులో 15 నుంచి 30 నిముషాలు ఉండేలా చూసుకోవాలి. ఇది పిల్లలకు పుస్తకాలు చదవడం అనేది పెద్ద సమస్యగా చూసే భయాన్ని పోగొడుతుంది.

6. లైబ్రరీ అలవాటును ప్రోత్సహించండి.

కొత్తగా పిల్లలకు ఇష్టమైన పుస్తకాలు, కథలు మార్కెట్ లోకి రాగానే వాటిని పట్టుకొచ్చి ఓ చిన్న స్థలంలో ప్రత్యేకంగా పెడుతూ ఉండండి. నెమ్మదిగా ఇది చిన్న లైబ్రరీగా మారుతుంది. సమయం దొరికినపుడు పక్కనే ఉన్న చిన్న చిన్న లైబ్రరీలకు పిల్లలను తీసుకువెళ్ళి కొంత సమయం చదువుతూ గడపడం వల్ల వాళ్ళలో లైబ్రరీ అవసరం తెలుస్తుంది. ఆసక్తి పెరుగుతుంది. ఇదే అలవాటుగా కూడా మారుతుంది.

7. పిల్లల చదువు ఏలా సాగుతుంది.

స్కూల్లో పిల్లలకు పోటీ తత్వమే తప్ప సొంతంగా రీడింగ్ స్కిల్స్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో వాళ్ళలో చదివే లక్షణం తగ్గుతుంది. అది కూడా పాఠ్య పుస్తకాల బట్టీ పట్టే వరకే ఉంటుంది. సొంతంగా అభిరుచితో పుస్తకాలను ఎంచుకుని చదివే అలవాటు చేయడం వల్ల జ్ఞాపకశక్తి, క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇది పెద్దలే ప్రోత్సహించి అలవాటు చేయాల్సిన విషయం.

8. చదివే అలవాటు ఫలితాలు.

చదవడం కాలక్రమేణా పిల్లల్లో ఆసక్తిని పెంచి మంచి పాఠకులుగా మారేలా చేస్తుంది. పిల్లల్లో అక్షరాలను చదివడానికి ఇబ్బంది ఉందని గ్రహిస్తే కనక ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలి. ప్రత్యేకమైన ట్యూటర్ సహాయంతోనైనా చదువు కొనసాగేలా చూడాలి.

9. ఇలా ప్రోత్సహించండి.

చదవడంలో పిల్లలకు పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ ప్రోగ్రాములు, పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

10. క్రింద తెలియపరచినవి

  • 1. హొటల్ లోని మెనూలు
  • 2. రోడ్ సైడ్ కనిపించే బోర్డ్స్
  • 3. గేమ్ గురించిన మేటర్స్
  • 4. వాతావరణ నివేదికలు
  • 5. అలాగే ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, కాస్త ఖాళీ సమయాల్లో పిల్లలు చదివే విధంగా కొన్ని పుస్తకాలనో, కామిక్ పత్రికలనో దగ్గర ఉంచండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Motivate Your Child"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0