Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

20 thousand schools closed across the country

దేశవ్యాప్తంగా 20 వేల స్కూళ్ల మూత

20 thousand schools closed across the country

  • టీచర్ల సంఖ్యలో 1.95% తగ్గుదల
  • కేంద్ర విద్యాశాఖ 2021-22 నివేదిక

దేశంలో ఒక ఏడాది కాలానికి 20,000కు పైగా స్కూళ్లు మూతపడ్డాయని, ఉపాధ్యాయుల సంఖ్యలోనూ 195 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాల విద్య తీరుతెన్నులపై 2021-22 కాలానికిగాను ఏకీకృత జిల్లా విద్యాసమాచార విధానం (యూడైస్ )'పై విడు దల చేసిన ఈ నివేదిక 44.85 శాతం స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సౌకర్యం ఉన్నట్లు తెలిపింది. దాదాపు 34% స్కూళ్లకు ఇంటర్నెట్ వసతి ఉంది. '2020-21లో మొత్తం పాఠశాలల సంఖ్య 15:03 లక్షలు ఉండగా, 2021-22 నాటికి ఇది 14.89 లక్షలకు తగ్గింది. ఎక్కువగా ప్రయివేటు యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లు మూతపడ్డాయి' అని గురువారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. విద్యార్థుల చేరికపై కొవిడ్ ప్రభావం గురించి వివరిస్తూ.. ఈ మహమ్మారి ప్రభావం బాగా ఉంది. ఎక్కువగా యువత, ప్రీ ప్రైమరీ తరగతులకు చెందిన దుర్బల చిన్నారుల పై దీని ప్రభావం మెండు' అని వివరించింది. కోవిడ్-19 కారణంగా ప్రవేశాలను వాయిదా వేయడం ఈ క్షీణతకు కారణంగా అంచనా వేశారు. 2021-22లో ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల్లోకి ప్రవేశాలు దాదాపు 25.57 కోట్ల మేర ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థుల నమోదులో పెరుగు చల ఆశాజనక అంశంగా చెప్పవచ్చు. ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ విద్యకు వెళ్లిన బాలికల సంఖ్య 12. 20 కోట్లు, 2020-21తో పోల్చితే 9,10 లక్షలు పెరిగారు.

దేశంలో 2020-21 ఏడాదిలో ఉపాధ్యాయుల సంఖ్య 97.87 లక్షలు ఉండగా.. 2021-22 నాటికి ఈ సంఖ్య 35,07 లక్షలకు తగ్గింది. ఈ తగ్గుదల ప్రభుత్వం పాఠశాలల్లో 0.9 శాతం, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 1.15 శాతంగా ఉంది. ప్రయివేటు పాఠశాలల్లో 294 శాతం టీచర్లు తగ్గారు. ఇతరత్రా స్కూళ్లలో ఇది 88% ఉంది. 2021-22లో విద్యార్థులు ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 28 ఉండగా, ప్రాథమికోన్నత పార శాలల్లో 19, సెరుడరీ స్కూళ్లలో 18, హయ్యర్ సెకం డరీ స్కూళ్లలో 27గా ఉంది.

 ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం 27 శాతం స్కూళ్లలో మాత్రమే ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 45 శాతానికి పైగా పాఠశాలలకు రెయిలింగుతో కూడిన ర్యాంపులు ఉన్నాయి. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ నివేదిక అధ్య యనంలో పాఠశాలల గ్రంథాలయాల్లో పుస్తక లభ్యత. సహ అభ్యాసం తదితర అంశాల ఆదనపు సమాచారం కూడా సేకరించారు.

ఉన్నత ప్రదర్శన రాష్ట్రాల్లో ఏపీ

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించిన పెర్పా ర్మైన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో 6 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం లెవల్-2 దశకు చేరుకు న్నాయి. లెవల్-1 స్థాయిలో ఒక్క రాష్ట్రం కూడా లేకపోవడం గమనార్హం. ఎల్-2 స్థాయికి చేరుకొ న్నవాటిలో ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు, చండి గఢ్ ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "20 thousand schools closed across the country"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0